పుట:Tikkana-Somayaji.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ యధ్యాయము

95


విశ్వాసార్హములు గావు. నన్నయభట్టునకు రెండుశతాబ్దులకు బిమ్మటనున్న తిక్కనసోమయాజి వఱకు భారతమాంధ్రీకరింపఁ బడియుండుటకుఁ గారణమునడుమకాలమునఁ గవులు లేక యుండుట గాదు. కవుల నేకులు గలరు. కాని వారి కాత్మశక్తి యందు విశ్వాసము లేదు. ఈమహోత్కృష్టగ్రంథము నాంధ్రీకరించుటకు గొప్ప ప్రతిభాశాలి పుట్టవలయు నని తలంచి యుందురు. వారు తలంచినవిధముగానే ప్రజ్ఞానిధి పుట్టెను. నిర్వచనోత్తరరామాయణము రచించునాటికిఁ దిక్కన తానెంత వైదికమార్గప్రవర్తకుఁడై యున్నను శివభక్తిపరాయణుఁడై యుండెను. తరువాత శ్రౌతస్మార్తక్రియాతత్పరుఁడై పూర్వమీమాంస మతావలంబకుఁడై కర్మాచరణమె ప్రాధాన్యముగాఁ దలంచెను. భారతమును రచించునాటికి హరిహరులకభేదమును బాటించి యద్వైతమునం దాసక్తిజనించియే తన్మతసాంప్రదాయములను ధర్మములను లోకమున వ్యాపింపఁజేయ సంకల్ప ముదయించి యందుకొఱకే తక్కినజీవితకాలము నంతయు వినియోగించి కృతకృత్యుఁడై ధన్యుఁడయ్యెను. కావున సోమయాజిమతము ప్రథమమునుండియు నొక్కతీరున నుండెననిచెప్ప వీలులేదు. అద్వైతమతధర్మములను సిద్ధాంతములను భారతము మూలముగా నాంధ్రభాషలో మొదట రచించినవాఁడు తిక్కన యనియే భావించెదను. తిక్కనసోమయాజి హరిహరనాధరూపుఁ డగు పరవస్తువును సగుణబ్రహ్మముగాఁ భావించి,