94
తిక్కన సోమయాజి
దానిని దెలిగించినచో తనగతియు నట్లే యగునన్న భీతిచేత నితఁడు దానిని తెనిఁగింపఁ డయ్యెను. అందుచేత తెనుఁగు భారతము కొంతకాలము పూర్ణముగా లేక కొఱతపడి యుండెను. ఆకాలమునందు వ్రాయఁబడినతాళపత్ర గ్రంథములు కొన్ని యిప్పటికిని వనపర్వశేషము లేకయే కానఁబడుచున్నవి. కవిని బట్టినభీతియే తరువాత నారణ్యపర్వశేషమును జేసిన
యెఱ్ఱాప్రెగ్గడకును పట్టి తనపేరిట గ్రంథరచన చేయక రాజనరేంద్రుని కంకితముగా నన్నయభట్టు పేరుపెట్టియే దానిని రచించెను. అంతేకాక భారతమును చదువువారు సయితము నేటివఱకును ఆరణ్యపర్వము లోనికొంతభాగము వదలియే మఱి గ్రంథపఠనము చేయుచున్నారు." అని యాంధ్రకవుల చరిత్రమునం దతి శయోక్తిగా వ్రాయఁబడిన వాక్యములు
యథార్థములుగాఁ గన్పట్టవు. ఆరణ్యపర్వమును సంపూర్తిగానే నన్నయభట్టు రచించె నని తిక్కనపద్యమువలనఁ దెల్లమగుచున్నది. నన్నయభట్టు కృతారణ్యపర్వము తిక్కన కాలమునాటికి బాగుగానే యుండి యెఱాప్రెగ్గడకాలమునాటికి నాపర్వములోని కడపటిభాగము నశించి యుండవచ్చును. దానిని శంభుదాసు తెనిఁగించి యుండును. అంతియకాని యారణ్యపర్వము తెనిగించుటచేత నన్నయకుఁ బిచ్చి యెత్తిన దని భయపడి తిక్కన దానిని విడిచి పెట్టి విరాటపర్వము నుండియుఁ దెనిగించినాఁ డనిచెప్పెడికథ లేవియును