తొమ్మిదవ యధ్యాయము
93
పర్వములును దుదిముట్ట రచించుట యొప్పు నని యిఅదిగువ పద్యములోఁ జెప్పి యున్నాఁడు.
"మ. హృదయాహ్లాది చతుర్థ మూర్జితకథోపేతంబు నానారసా
భ్యుదయోల్లాసి విరాటపర్వ మట యుద్యోగాదులుం గూడఁగాఁ
బదియేనింటిఁ దెనుంగుబాస జననసంప్రార్థ్యంబు లై పెంపునం
దుది ముట్ట౯ రచియించు టొప్పు బుధసంతోషంబు నిండారగ౯ ”
ఈ పై రెండుపద్యములం జదివినవారికిఁ దిక్కన సుహృదయముబోధపడక మానదు. ఇదివఱ కొకపండితునిచేఁ దెలిగింపఁబడినభాగమును మరల దాను దెలిగించుట ధర్మముగాదని విడిచి విరాటపర్వము మొదలుకొని రచించుట తగ వని చెప్పెను. కవిధర్మము నాలోచించి కొఱగానిపనులు గూడ వని తలంచి యామూఁడుపర్వములను దెలిగింపక విడిచిపెట్టినాఁడు గాని తెలిగింపఁ జేతఁగాక కాదు. అట్లుగాక తిక్కన మొదలనుండియుఁ దెలిగించెనేని నన్నయభట్టు మూడుపర్వములు నధర్వణాచార్యుఁడు రచించినపర్వములవలెనే సర్వత్ర వ్యాపింపక నశించిపోయి యుండును. అ ట్లొనరించుటకుఁ దిక్కన సమ్మతింప లేదు. దీన్నిఁబట్టి తిక్కన యెట్టెసుహృదయము గలవాఁడో తేఁటపడ గలదు. తాను దెనిగింపకుండుటయే గాక నన్నయ దక్షతతో మూఁడుకృతులు రచించె నని యోగ్యతాపత్రముగూడ నొసంగి గౌరవించి నాఁడు.
"ఆరణ్యపర్వము నాంధ్రీకరించుటచేతనే నన్నయభట్టు మతిభ్రమణము గలిగి మృతినొందె నని తలఁచుకొని తాను