హేమ్! ఏమి టా ఏడ్పు ? మతిపోయిందా? మీ అక్క చనిపోయి పదకొండు ఏళ్లయింది.
............
నీ స్థితికి అర్ధం ఉందా? ఇది హిస్టీరియాగాని ఇంకోటి కాదు ? ఇంత నీరసురాలివయ్యా వేమిటి? ఇంతకన్న అవమానం ఇంకోటి ఉందా? పుస్తకం చదువుతూ అంత ఏడుస్తారా ఎక్కడన్నా! లే, కళ్ళు తుడుచుకో. నేను ఈ రాత్రి నీ దగ్గరే పండుకుంటాను.
లోకం, త్యాగతి మా బావ. మా అక్క ఎంత....
మీ అక్క దేవత. పది హేను రోజుల క్రిందట ఈ పుస్తకం త్యాగతి నాచేతి కిచ్చాడు. అందులో చదివిన విషయాలు ఎవ్వరికీ చెప్పవద్దన్నాడు. నేను చదివి పొందిన బాధ, దుఃఖమూ వర్ణించలేనిది! హేమా, మనం చదువుకొన్నవాళ్ళం. మనకూ, మూర్ఖునికీ కూడా దుఃఖం ఒకటే, అయినా మనం దిగమింగి లోపల కుళ్ళుతాం. వాళ్ళు పైకి ఏడ్చి బాధనుండి విముక్తులవుతారు. అంతే తేడా! నీ దుఃఖం పవిత్రమైంది. నువ్వలా ఏడ్వడం మంచిదే. కాని దుఃఖాన్ని కూడా మనం సాక్షులమై దర్సించాలిగాని, మనం కూడా దుఃఖంలో భాగమైతే ఇంకేముందీ? లే! కాఫీ చేసి తీసుకురానా?
నేనూ వస్తాను వంటింటిలోకి: పద
హేమ లోకేస్వరుని కౌగిలించుకొనే వారిద్దరూ వంటింటిలోకి వెళ్ళారు. హేమకు కంటెదుట ఆమె అక్క కనిపించింది. ఆమె చిన్న నాడు తనపై చూపిన గంభీర ప్రేమ కల్లగట్టింది. అక్కా! నువ్వు ఎందుకు బ్రతకలేదు. నీ కిప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు ఉంది వుండును. నీ బిడ్డలు పరమ సౌందర్యమూర్త్లులుగా ఉందురు. నీ ప్రేమలో నేను ఎన్ని జీవిత రహస్యాలు తెలిసికొని ఉండేదాన్ని అని హేమ అనుకొంటూ కన్నీటి వెల్లువ తుడుచుకుంటూనే ఉంది. లోకేశ్వరి వెనక్కు తిరిగి చూస్తూనే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కాఫీ తయారుచేసి హేమకు ఒక కప్పు ఇచ్చింది. ఇద్దరూ చెరో కప్పు కాఫీ తాగి మళ్ళీ పడకటింటిలోనికి వచ్చారు. అక్కడ క్రిందపరచిన తివాసీలపై పరిచారిక పడుకొని నిద్దుర పోయినది.
ఒకరి దుఃఖం ఇంకొకరికేమి అర్ధమవుతుంది! ఆమెకు యజమానురాలి ఆవేదన ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత సానుభూతి నాళాలు స్పందనం కాగా కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అది మానవ సహజం. లోకేశ్వరి విద్యుద్దీపం చిన్నది వెలిగించి, పెద్దది అర్పి, పరిచారికను లేపి,వెళ్ళిపడుకోమని చెప్పి , తలుపు వేసి, పందిరిమంచముపై హేమ పక్కన పండుకొని,ఆమెను గట్టిగా హృదయాని కదుముకొంది. హేమకు నిద్రపట్టదు. లోకేశ్వరికి నిద్రపట్టదు. వారేమీ మాటలాడుకొనలేదు. గంటకు లోకేశ్వరికి నిద్ర పట్టింది.
త్యాగతి, శ్రీనాథమూర్తి, తన బావ, తన అక్క ఎక్కడ వుంది? అంతవరకు అక్క బ్రతికి వున్నట్లు, తాను చిన్న బిడ్డ అయినట్లు హేమ భావిస్తూ
పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/84
స్వరూపం
ఈ పుటను అచ్చుదిద్దలేదు