పుట:Thobithu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు నేను షల్మనేసరు దయకు నోచుకొనునట్లు చేసెను. ఆ రాజు తనకు వలసిన వస్తుసంభారములను కొనుటకు నన్ను నియమించెను. 14. అతడు చనిపోవు వరకును నేను మేదియా దేశమునకు ప్రయాణముచేసి అచట అతనికి కావలసిన పదార్ధములను కొనెడివాడను. ఒకసారి నేను మేదియా లోని రాగీసు పట్టణమునకు బోయినపుడు గాబ్రియా కుమారుడైన గబాయేలు నింట పదిసంచుల వెండినాణెములు దాచితిని.

15. షల్మనేసరు చనిపోయిన పిదప అతనికుమారుడు సన్డెర్రీబు రాజయ్యెను. అటుతరువాత మేదియాకు ప్రయాణము చేయుట సుకరము కానందున నేనచటికి వెళ్లనేలేదు 16. షల్మనేసరు బ్రతికియున్న కాలమున నేను మా జాతివారికి పెక్కు దానధర్మములు చేసితిని. 17. వారు ఆకలి గొనివచ్చినపుడు నేను వారికి భోజనము పెట్టెడివాడను. బట్టలు లేనివారికి బట్టలిచ్చెడివాడను. నీనెవె పౌరులు మా జాతివారి శవములను ಏಟ್ಟಣ ప్రాకారము వెలుపల పడవేసినపుడు నేను వానిని పాతి పెట్టెడివాడను.

18. సన్డెరీబు యూదా మీదికి దాడి చేసినపుడు స్వర్గాధిపతియైన ప్రభువును దూషింపగా అతడు ఆ రాజును శిక్షించెను. కనుక సన్డెర్రీబు యూదాను విడిచి రావలసినవచ్చెను. అట్లు తిరిగివచ్చిన పిదప అతడు కోపావేశముతో చాలమంది యిప్రాయేలీయులను సంహరించెను. నేను వారి శవములను రహస్యముగా గొనిపోయి పాతిపెట్టితిని. అటుతరువాత రాజు ఆ శవముల కొరకు గాలింపగా అవి యతనికి దొరకలేదు. 19. అప్పడు నీనెవె పౌరుడొకడు రాజు చంపించినవారి శవములను రహస్యముగా పాతి పెట్టినది నేనే యని యతనితో చెప్పెను. నేనా సంగతి తెలిసికొంటిని. రాజపురుషులు నా ప్రాణములు తీయుటకు నన్ను గాలించుచుండిరి. కనుక నేను భయపడి నీనెవె నుండి పారిపోయితిని. 20. వారును నా సొత్తు నంతటిని స్వాధీనము చేసికొని రాజు కోశాగారమున కొప్పజెప్పిరి. ఇక నా భార్య అన్నానా కుమారుడు తోబియా తప్ప నాకేమియు మిగులలేదు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/5&oldid=237534" నుండి వెలికితీశారు