పుట:Thobithu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బండిన మొదటి పంటను, మా గొడ్లు ఈనిన తొలిచూలి పిల్లలను, మాపశువులలో పదియవ వంతును, మా గొట్టెలనుండి కత్తిరించిన మొదటి యునిని తీసికొని నేను త్వరత్వరగ యెరూషలేమునకు ప్రయాణము చేసెడివాడను. 7. అచటి దేవళమునందు పీఠము ముందుట నిలచి ఈ కానుకలనెల్ల అహరోను వంశజులైన యాజకులకు అర్పించెడివాడను. యెరూషలేమున దేవుని సేవించులేవీయులకును ధాన్యమునందును ద్రాక్ష సారాయమునందును ఓలివు తైలమునందును దానిమ్మలు అంజూరములు మొదలైన ఫలములందును పదియవవంతు సమర్పించెడివాడను ఒక్క యేడవయేడు తప్ప ప్రతి ఆరేండ్లను నాకు పండినపంటలో ఇంకొక పదియవవంతును గూడ విక్రయించి ఆ సొమ్మను యెరూషలేమున ఉత్సవ భోనమునకు వినియోగించెడివాడను.

8. ప్రతి మూడవ యేడును నా పంటలో వేరోక పదియవ వంతునుగూడ గొనివచ్చి యెరూషలేమున వితంతువులకు అనాథులకు యిస్రాయేలీయుల మధ్య వసించు విదేశీయులకు కానుకగా ఇచ్చెడివాడను. వారును నేనును కలసియే ఉత్సవ భోజనమును భూజించెడివారము. నేను మోషే ధర్మశాస్త్రము ప్రకాము ఈ కార్యములెల్ల చేసితిని. మా తండ్రి అనానీయేలునకు తల్లియైన దెబొరా కూడా ఇట్టి కార్యములు చేయ వలయునని నాతో చెప్పెను. (చిన్ననాడే మా తండ్రి చనిపోయినందున నేను అనాథుఢనైతిని). 9. నేను పెరిగి పెద్దవాడనైన పిదప అన్నా అను మా తెగ పిల్లనే పెండ్లి యాడితిని. మా కొక బిడ్డడు కలుగగా వానికి తోబియా అని పేరు పెట్టితిమి.

10. తరువాత మమ్మ అస్సిరియూకు ప్రవాసమునకు గొనివచ్చినపుడు నన్ను నీనెవెకు తీసుకొనివచ్చిరి. అచట మా బంధువులు తోడి యూదులు ఆ దేశీయులు భుజించు అన్నమునే తినెడివారు. 11. కాని నేను మాత్రము వారి కూడు ముట్టుకోలేదు. 12. నేను సర్వోన్నతుడైన ప్రభువు ఆజ్ఞలను నిండు హృదయమ్లుతో పాటించితిని. 13. కనుక ఆ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/4&oldid=237533" నుండి వెలికితీశారు