పుట:Thobithu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాడువడును. శత్రువులు దేవుని మందిరమును కూల ద్రోసి కాల్చివేయగా అది కొంతకాలముపాటు శిథిలమైయుండును. 5. కాని ప్రభువు మరల తన ప్రజలను కరుణించి వారిని యిప్రాయేలు దేశమునకు కొనివచ్చును. వారు దేవుని మందిరమును మరల కట్టుదురు. కాని అది మొదటి మందిరమంత సుందరముగా నుండదు. తగుకాలము వచ్చు వరకును ఆ మందిరము ఆ రీతిగనే యుండును. కాని ఉచితకాలము రాగానే యిస్రాయేలీయు లెల్లరును ప్రవాసమునుండి తిరిగివచ్చి యెరూషలేము నగరమును పూర్వపు రీతినే సుందరముగా నిర్మింతురు. వారు యిస్రాయేలు ప్రవక్తలు నుడివినట్లే యెరూషలేమున దేవుని మందిరమును గూడ నిర్మింతురు.

6. అప్పడు సకలజాతి ప్రజలును ప్రభువు నొద్దకు తిరిగివత్తురు. వారు అతని నొక్కనినే నిజమైన దేవునిగా భావించి పూజింతురు. తమ్మ అపమార్గము పట్టించిన విగ్రహములను విడనాడుదురు. 7. ఆ జనులెల్లరును శాశ్వతుడైన ప్రభువు చిత్తము ప్రకారము జీవించుచు ఏ ప్రొద్దును అతనిని కొనియాడుదురు. ఆ కాలమున ప్రభువు తనకు విధేయులైన యిస్రాయేలీయు లనందరిని రక్షించును. ప్రభువు వారినెల్లరిని యెరూషలేమునకు కొనిరాగా వారు అబ్రాహము భక్తము చేసికొనిన భూమిని స్వాధీనము కావించుకొని ఆ గడ్డమిూద కలకాలము సురక్షితముగా వసింతురు. ప్రభువును చిత్తశుద్ధితో సేవించువా రందరును ప్రమోదము చెందుదురు. కాని పాపకార్యములు చేయు దుర్మారులను మాత్రము అతడు నేల విూదినుండి తుడిచివేయును.

8. నాయనలారా! మిూరు నాయుపదేశములను పాటింపుడు. దేవుని చిత్తశుద్ధితో సేవింపుడు. అతనికి ప్రియమైన కార్యములు చేయుడు. 9. దేవుని యాజ్ఞల ప్రకారము జీవింపవలయుననియు, పేదలకు దానధర్మములు చేయవలయుననియు, ఎల్లవేళలందును ప్రభువును జ్ఞప్తియందుంచుకొని యతనిని పూర్ణహృదయముతో కీర్తింపవలయుననియు మి" బిడ్డలకు నేర్పుడు.

10. కుమారా! నీవు నీనెవెను విడనాడి వెళ్లిపొమ్మ ఇచ్చట

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/33&oldid=237531" నుండి వెలికితీశారు