పుట:Thobithu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోబీతు

1.1. తోబీతునైన నా కథ యిది. మా తండ్రితాతలు క్రమముగా అనానీయేలు, అదూవేలు, గబాయేలు అనువారు. వారు అసీయేలు కుటుంబమునకు నస్తాలి తెగకును చెందినవారు. 2. నేను అస్సిరియా రాజైన షల్మనేసరు కాలమున తిష్బీ నుండి బందిగా కొనిరాబడితిని. ఈ నగరము గలిలయ రాష్ట్రమున ఉత్తర భాగమున నున్నది. మరియు అది నస్తాలి మండలములోని కాడేషునకు దక్షిణముగాను, హజోరునకు ఎగువగాను, షేఫటునకు ఉత్తరముగాను ఉన్నది.


1. ప్రవాసమున తోబీతు

3. తోబీతునైన నేను నా జీవితమందెల్లప్పడును ధర్మమును పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చితిని. నావలె నీనెవె పట్టణమునకు ప్రవాసులుగా గొనిరాబడిన తోడి యూదులకును మా బంధువులకును నేను మిక్కిలిగా దానధర్మములు చేసితిని. 4. నేను బాలుడనుగా నుండినపుడు మా యిస్రాయేలు దేశమున వసించితిని అప్పడు మా నఫాలి తెగవారందరును యెరూషలేము నగరమును దావీదు వంశజులైన రాజులను తిరస్కరించిరి. కాని ప్రభువు యిస్రాయేలు నగరములన్నిటిలోను ఆ యెరూషలేము నగరమున తన శాశ్వత నివాసమునకు పవిత్ర మందిరము నిర్మింపగోరెను. యిప్రాయేలీయు లెల్లరును ఈ తావుననే బలులు అర్పింపవలయును. 5. ఐనను నఫాలి తెగకు చెందిన ఎల్లప్రజలవలె, మా కుటుంబమువారును గలిలయలోని దాను నగరమునకు వెళ్ళి అచట యిస్రాయేలు రాజైన యరోబాము నెలకొల్పిన కోడెదూడలకు బలులర్పించెడివారు.

ధర్మశాస్త్రము ప్రకారము యిస్రాయేలీయు లెల్లరును పండుగులలో పాల్గొనుటకు యెరూషేలేమునకు బోవలయును. ఇది నిత్యవిధి. 6. కాని తరచుగా నేనొక్కడనే అచటికి యాత్ర చేసెడివాడను. మా పొలమున

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/3&oldid=237527" నుండి వెలికితీశారు