పుట:Thobithu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెడమిూద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను. "నాయనా! నా కంటికి దీపమవైన నీవు ఇపుడు నాకు కన్పించుచున్నావు సుమా! అని పల్కెను. అతడింకను

“ప్రభువును స్తుతింపుడు అతని మాహాత్మ్యమును కొనియాడుడు పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు అతని మాహాత్మ్యమును కలకాలము స్తుతింపుడు

15. అతడు నన్ను గ్రుడ్డితనముతో శిక్షించెను కాని యిప్పడు నన్ను కరుణించెను కనుకనే యిప్పుడు నేను నా కుమారుని చూడగల్గితిని"

అని యనెను. అంతట తోబియా సంతోషముతో దేవుని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్లేను. తరువాత అతడు తండ్రికి, తన సంగతియంతయు చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదనియు, తాను సౌమ్మను గొనివచ్చితిననియు, అంతమాత్రమే కాక రగూవేలు కొమార్తెయైన సారాను గూడ పెండ్లి యూడితిననియు, ఆమె కూడ వెనువెంటనే వచ్చుచున్నదనియు, అప్పటికే నీనెవె నగర ద్వారములను చేరియుండు ననియు వివరించెను.

16. తోబీతు కోడలిని కలసికొనుటకై పట్టణ ద్వారమునకు బయలుదేరెను. దారిపొడువున ప్రభువును స్తుతించుచు వెళ్లేను. అతడు తోడులేకుండ గబగబ నడుచుటను జూచి ప్రజలు విస్తుపోయిరి. 17. దేవుడు తన్నుకరుణించి తనకు దృష్టి దయచేసెనని తోబీతు పురజనులతో చెప్పెను. అంతట నతడు తన కోడలు సారాను కలసికొని ఆమె కిట్లు స్వాగతము చెప్పెను. "కుమారీ! నీకు స్వాగతము. దేవుడు నిన్ను మా యింటికి గొనివచ్చెను. కనుక ఆ ప్రభువునకు స్తోత్రములు. అతడు నీ తండ్రిని నిన్ను నా కుమారుని దీవించుగాక. ఇప్పడు నీ సొంత యింటిలో అడుగిడుము. నీకు ఎల్లవేళల ఆరోగ్యము, సంతోషము దీవెనలు సిద్ధించుగాక. కుమారీ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/29&oldid=237526" నుండి వెలికితీశారు