పుట:Thobithu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. తోబీతు దృష్టిని పొందుట

11.1. వారు ప్రయాణముచేయుచు నీనెవె చెంతగల కసెరీను నగరము దాపులోనికి వచ్చిరి. 2. అప్పుడు రఫాయేలు తోబియాతో "మనము బయలుదేరినప్పడు నీ తండ్రి ಝೆಟ್ಟಿ దీనస్థితిలో నుండెనో నీకు తెలియునుగదా! 3. కనుక ఇపుడు మనము నీ భార్యకంటె ముందుగాబోయి ఇంటిని సిద్ధము చేయుదము. ఆమె ప్రయాణికులతో నిదానముగా వచ్చును. 4. నీవు ఆ చేప పిత్తమును తెచ్చుట మాత్రము మరువకుము" అని చెప్పెను. అట్లవారు ముందు నడువగా తోబియా కుక్క వారివెంట బోయెను.

5. అక్కడ అన్నా కుమారునికొర కెదరుచూచుచు త్రోవవైపు పారజూచుచు కూర్చుండెను. 6. ఆమె తటాలున తోబియా వచ్చుటను జూచి పెనిమిటితో "అదిగో! మన అబ్బాయి నేస్తునితో వచ్చుచున్నాడు" అని చెప్పెను.

7. తోబియా తన తండ్రి చెంతకు వెళ్లకమునుపే రఫాయేలు అతనితో "నీవు నామాట నమ్మము. నీ తండ్రికి మరల చూపు వచ్చును. 8. నీవు ఈ చేప పిత్తమును మిరా నాయన కన్నులకు పూయవలయును. ఆ ముందువలన అతని కంటిలోని పొరలు కుదించుకొని పోవును. నీవు వానిని పెరికివేయవచ్చును. వెంటనే మి నాయనకు చూపు వచ్చును.” అని చెప్పెను. 9. అప్పడు అన్నా పరుగెత్తుకొనివచ్చి కుమారుని కౌగిలించుకొనెను. "నాయనా! నిన్ను కన్నులార జూచితిని కనుక ఇక నిశ్చింతగా ప్రాణములు విడుతును" అనుచు సంతోషముతో కన్నీరు గార్చెను. 10. తోబీతు తడవుకొనుచు ముంగిలి తలుపుగుండ వెలుపలికి నడచివచ్చెను. 11. తోబియా చేప పిత్తముతో తండ్రి యెదుటకు వచ్చెను. అతడు తండ్రి కనుల విూద ఊది అతనిని తన చేతితో పట్టుకొని నాయనా! ధైర్యము తెచ్చుకొనుమని చెప్పెను. 12–13 అంతట అతడు చేప పిత్తమును తండ్రి కనులకు పూసెను. ఆ వృదుని కన్నులలోనుండి కంటికొనలతో మొదలుపెట్టి తెల్లని పొరలను పెర్తిక్రివేసెను. 14. తోబీతు కుమారుని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/28&oldid=237525" నుండి వెలికితీశారు