పుట:Thobithu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నాయనా! నీవు ఇప్పడే వెళ్లనేల? మరి కొన్నినాళ్లు మా యింట వసింపుము. నేను నీ తండ్రియొద్దకు దూతలను బంపి నీవు క్షేమముగానే యున్నావని చెప్పింతును" అని పల్కెను. 9 కాని తోబియా పట్టినపట్టు విడువక నన్ను మా తండ్రి యొద్దకు వెళ్లిపోనిమ్మని బతిమాలెను. 10. రగూవేలు ఇక జాగు చేయక సారాను తోబియా కప్పగించెను. అతడు తన సొత్తులో సగభాగమును - అనగా బానిసలు ఎడ్లు గొట్టెలు గాడిదలు ఒంటెలు దుస్తులు డబ్బు సామానులు - మొదలైన వానిలో సగము అల్లునకిచ్చెను. 11. అతడు తోబియాను సాగనంపుచు అతని నాలింగనము చేసికొని "నాయనా! సురక్షితముగా పోయిరమ్మ స్వర్గాధిపతియైన దేవుడు నిన్నును సారాను కాపాడునుగాక. నేను కన్నుమూయక మునుపే మిరా బిడ్డలను చూతునుగాక” అని దీవించెను. 12 సారాను సాగనంపుచు “తల్లీ! నీ భర్తతో వెళ్లి మిరా యత్తగారి యింట కాపురము చేయుము. ఇకమిూదట నీ యత్తమామలు నీకు కన్నతల్లిదండ్రుల వంటివారు. నేను బ్రతికి యున్నంతకాలమును నీ నడవడికను గూర్చి మంచివార్తలే విందనుగాక" అని దీవించెను. అంతట అతడు వారికి వీడ్కోలు చెప్పెను.

అప్పడు ఎద్నా తోబియూతో 'నాయనా! దేవుడు నిన్ను సురక్షితముగా ఇల్లుజేర్చునుగాక. నేను మిగా బిడ్డలను చూచువరకును జీవింతునుగాక. దేవుడు సాక్షిగా నేను నా బిడ్డను § కొప్పగించుచున్నాను. నీవు జీవించినంతకాలమును ఆమె నెప్పడును దుఃఖపెట్టకుము. సురక్షితముగా పోయిరమ్మ ఇప్పటినుండి సారా నీకు భార్య నేనునీకు తల్లిని. మనము బ్రతికియున్నంతకాలము సుఖముగా జీవింతముగాక" అని చెప్పెను. ఆమె అల్లుని కూతురును ముద్దాడి సాగనంపెను.

13 తోబియూ సంతోషముతో రగూవేలు నింటి నుండి బయలుదేరెను. అతడు తన ప్రయాణము విజయవంతమయ్యెను గనుక స్వర్గాధిపతియు లోకపాలకుడునగు దేవుని స్తుతించెను. ఇల్లు వీడక ముందు తన అత్తమామలను వారు బ్రతికియున్నంతకాలము గౌరవముతో జూచుకొందునని మూట యిచ్చెను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/27&oldid=237524" నుండి వెలికితీశారు