పుట:Thobithu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10.1. అచట తోబీతు. ప్రతిదినమును తన కుమారుడు రాగీనునకుపోయి తిరిగివచ్చుటకు పటుదినములను లెక్క పెట్టుకొనుచుండెను. తాను అంచనావేసిన దినములు గతించినను తోబియా తిరిగిరాడయ్యెను. 2-3 కనుక అతడు “కుమారుని కక్కడ యేమి యూలస్యము జరిగినదో ఒకవేళ గబాయేలు చనిపోయినందున అచట సొమ్మనిచ్చువారెవరును లేరైరేమో" అని యనుకొనుచు విచారింపసాగెను. 4. అతని భార్య అన్నా"నా కుమారుడు గతించెను. వాడిక నా కంటబడడు" అనుచు పెద్దగా ఏడ్వదొడగెను. 5. ఆమె యింకను "నాయనా! నీవు నా కంటికి దీపమవు. నేను నిన్నెందుకు వెళ్లిపోనిచ్చితిని?” అని యంగలార్చెను. 6. తోబియా "అన్నా! నీవిట్లు విచారింపకుము. మన బిడ్డకి కెట్టి యపాయమును కలిగియుండదు. అచట యేదియో జరుగుటవలనేవారు జాగుచేసి యుందురు. తోబియాతో బోయిన నేస్తుడు నమ్మదగినవాడు, మన కంునవాడుకూడ. నీవు దిగులుపడవలదు. మన కుమారుడు శీఘ్రమే తిరిగివచ్చును" అని భార్యను ఓదార్చెను. 7. కాని ఆమె "నీవిక మాటలు చెప్పవద్దు. నన్ను ఒంటరిగా వదలివేయుము. నీవు నన్ను మోసగింపకుము. నా బిడ్డడు నిక్కముగా చనిపోయెను" అని పల్కెను. ప్రతిదినము ఆమె తటాలున ఇంటిలోనుండి వెలుపలికి బోయి తన కుమారుడు పోయిన త్రోవవెంట మునిమాపువరకును పారజూచెడిది. ఎవరైనను తన్ను ఓదార్చబోయినను వారిమాట వినెడిదికాదు. ఇంటికి వచ్చిన తరువాత కన్నువాల్చకుండ రేయియంతయు కుమారుని కొరకు పలవించెడిది.

రగూవేలు తనకూతురు సారా వివాహ సందర్భమున జరుప నిశ్చయించిన పదునాలు దినముల యత్సవము ముగిసెను. తోబియా మామ చెంతకు వచ్చి "నన్ను వెళ్లిపోనిమ్మ మా తల్లిదండ్రులు నన్ను కంటితో జూచు ఆశను వదలుకొనియుందురు. కనుక నన్నిక మా యింటికి వెళ్లిపోనిమ్మ నేను ప్రయాణమై వచ్చినపుడు మా నాయన ಯೇಟ್ಟಿ దుస్థితిలో నున్నాడో నీకు ముందే విన్నవించితినిగదా!" అని యనెను. 8. రగూవేలు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/26&oldid=237523" నుండి వెలికితీశారు