పుట:Thobithu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. వివాహ మహోత్సవము

9.1. అటుతరువాత తోబియా రఫాయేలును బిల్చి 2. "నేస్తమా! నీవు నల్లురు సేవకులను రెండు ఒంటెలను వెంటబెట్టుకొని రాగీసు నందలి గబాయేలు నింటికి బొమ్మ 3. అతనికి ఈ చేవ్రాలుకల పత్రమును జూపి సొమ్మనడుగుము. అతనినిగూడ నీవెంట వివాహమహోత్సవమునకు తోడ్కొనిరమ్మ 4 మా నాయన నా కొరకై దినములు లెక్క పెట్టుకొను చుండునని నీకు తెలియును. నేను ఒక్కదినము జాగుచేసినను అతడు మిగుల దుఃఖించును. 5. మా మామ రగూవేలు నన్నిక్కడ ఇన్ని నాళ్లుండమని నిర్బంధము చేసెను. అతనిమాట నేను కాదనలేకపోయితిని" అనిచెప్పెను. 6. కనుక రఫాయేలు నల్లురు సేవకులను రెండు ఒంటెలను వెంటనిడుకొని మేదియా దేశములోని రాగీసునకు వెళ్లేను. దేవదూత గబాయేలు నింటనే బసచేసి అతనికి చేవ్రాలుకల పత్రమును చూపించెను. 7. తోబీతు కుమారుడైన తోబియా పెండ్లి సంగతి చెప్పి అతనిని వివాహమహోత్సవమునకు ఆహ్వానించెను. వెంటనే గబాయేలు వెండినాణెముల సంచులను లెక్కపెట్టి యిచ్చెను. అప్పటివరకు వానికి వేసిన ముద్రలుకూడ ఊడిపోలేదు. ఆ సంచులను ఒంటెలమిద కెక్కించిరి. 8. వారు మరుసటి దినము వేకువనే పెండ్లి పండుగకు పయనము కట్టిరి. ఆ మిత్రులు రగువేలు ఇల్లు చేరుకొనునప్పటికి తోబియా భోజనము చేయుచుండెను. అతడు లేచి నిలుచుండి గబాయేలునకు స్వాగతము చెప్పెను. గబాయేలు ఆనందబాష్పము లొలుకుచు తోబీతు నిట్లు దీవించెను. “నాయనా! నీ తండ్రి ధర్మాత్ముడు, ఉదారస్వభావుడు. నీవును ఆ తండ్రికి తగినకుమారుడవే. 9. స్వర్గము నందలి దేవుడు నిన్ను నీ యిల్లాలిని నీ యత్తమామలను దీవించుగాక. అచ్చముగా నా దాయాదియైన తోబీతువలె నున్న నిన్ను కన్నులార జూచు భాగ్యమును దేవుడు నాకు దయచేసెను. ఆ ప్రభువునకు కీర్తికలుగునుగాక.” L

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/25&oldid=237522" నుండి వెలికితీశారు