పుట:Thobithu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని నీ కృవలన అట్లు జరుగలేదు నీవు మా పట్ల ఎనలేని నెనరు జూపితివి

17. ఈ యేకైక పుత్రుని ఈ యేకైక పుత్రికను నీవు కరుణతో మన్నించితివి గనుక నీకివే మా మ్రొక్కులు ప్రభూ! ఈ దంపతులకు నీ కృపను నీరక్షణమును దయచేయుము అనందానురాగములతో జీవించునట్లు నీవు వీరిని దీవింపుము."

18. అంతట రగూవేలు తెల్లవారక మునుపే సేవకులచేత సమాధి పూడ్పించెను.

19. అతడు భార్యతో రొట్టెలను సమృద్ధిగా కాల్చమని చెప్పెను. తాను మందల యొద్దకుబోయి రెండు కోడెదూడలను నాలుపొట్టేళ్లను తోలుకొని వచ్చెను. వానిని కోసి వివాహోత్సవమునకు విందు సిద్ధముచేయుడని సేవకుల నాజ్ఞాపించెను. 20. తోబియాను పిల్చి "నీవు రెండు వారములపాటు మా యింటినుండి కదలకూడదు. కనుక ఇచటనే యుండుము. మన మిరువురమును కలసియే అన్నపానీయములు సేవింతము. అమ్మాయి యిన్ని కడగండ్ల పాలయిన తరువాత ఇప్పడు నీవామెను సంతోషపెట్టవలయును కదా! 21. రెండు వారములు కడచిన తరువాత నీవు నా సౌత్తులో సగముతీసికొని సుక్షితముగా నీ తండ్రి చెంతకు వెళ్ళవచ్చును. మి యత్తయు నేనును గతించిన తరువాత మిగిలిన సగమును నీకే దక్కును. నీ పట్ల మాకు గల యనురాగమునుగూర్చి నీవేమాత్రమును శంకింపవలదు. ఇంతవరకును సారాకు మేమెట్లు తల్లిదండ్రులమైతిమో ఇకమిూదట నీకును అట్లే తల్లిదండ్రుల మగుదుము. కనుక నీవేమియు సందేహింపవలదు" అని పల్కెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/24&oldid=237521" నుండి వెలికితీశారు