పుట:Thobithu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతనికి సాటియైన తోడునుగూడ జేసెదను” అని నీవు నిశ్చయించుకొంటివి.

7. నేను కామతృప్తికొరకు గాక దైవాజ్ఞకు లొంగి ఈ సారాను స్వీకరించితిని నీవు మమ్మ కరుణతో జూచి ముసలిప్రాయమువరకు మే మిరువురమును కూడిమాడి జీవించునట్లు దయచేయుము."

8. ప్రార్థనము ముగిసిన తరువాత వధూవరులు తథాస్తు అని జవాబు చెప్పిరి. 9. ఆ రేయి యిరువురును శయనించిరి.

ఆ రాత్రి రగూవేలు సేవకులను తీసికొనిపోయి సమాధి త్రవ్వించెను.

10. అతడు “బహుశః తోబియా కూడ మృత్యువు వాతబడియుండును. ఇరుగుపొరుగువారు మమ్మహేళనచేయుదురు కాబోలు" అని యనుకొనెను.

11. భార్యను పిల్చి 12. "ఒక పని పిల్లను శోభనపు గదిలోనికి పంపి తోబియా బ్రతికయున్నాడో లేదో తెలిసికొనిరమ్మని చెప్పము. అతడు చనిపోయేనేని యెవరికిని తెలియకుండ వెంటనే పాతిపెట్టదము" అని చెప్పెను. 13. కావున వారు పనికెత్తెను పిల్చి దీపమును వెలిగించిరి. గది తలుపులు తెరచి ఆమెను లోపలికి పంపిరి. ఆమె లోలికి వెళ్లి చూడగా వధూవరులిద్దరు గాఢనిద్రలో మునిగియుండిరి. 14. కనుక పనికత్తె వెలుపలికివచ్చి అతడు చనిపోలేదు బాగుగానే యున్నాడు అని చెప్పెను.

15. అప్పుడు రగూవేలు స్వర్గాధితియైన దేవుని ఇట్లు స్తుతించెను.

“ప్రభూ! నీవు స్తవనీయుడవు నీ ప్రజలు నిన్ను సదా కీర్తింతురుగాక నిర్మల హృదయముతోనే వారు నిన్ను స్తుతింతురుగాక

16. నీవు నన్ను సంతోషచిత్తుని జేసితివి కనుక

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/23&oldid=237520" నుండి వెలికితీశారు