పుట:Thobithu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. సమాధి

8. 1. వారు అన్నపానీయములు సేవించి ముగించినపిదప రేయి నిదురపోవు సమయమయ్యెను. అప్పడు సారా తల్లిదండ్రులు తోబియాను శోభనపు గదిలోనికి తీసికొని పోయిరి. 2. అతడు రఫాయేలు సలహాను జ్ఞప్తికి తెచ్చుకొని తన సంచిలోనుండి చేప గుండెను కాలేయమును వెలపలికి తీసి వానిలో కొంత భాగమును మండుచున్న సాంబ్రాణిమిద వేసెను. 3. భూతము ఆ వాసనను భరింపజాలక ఐగుప్త దేశము ఎగువ భాగమునకు పారిపోయెను. రఫాయేలు భూతము వెంటబడి తరిమెను. ఆ దేశమున దానిని బట్టుకొని దాని కాలు సేతులు బంధించెను.

4. సారా తల్లిదండ్రులు గది తలుపులు మూసి వెలుపలకు వచ్చిరి. తోబియా పడుకమిది నుండి లేచి సారాతో "నీవును లేచి నిలుచుండుము. ప్రభువు మనమిూద కరుణబూని మనలను కాపాడుటకు ఇరువురము ప్రార్థనము చేయుదము" అని చెప్పెను. 5. సారా లేచి నిలుచుండగా ఇరువురు ప్రభువు తమ్మ రక్షింపవలయునని మనవి చేయసాగిరి. తోబియా ఇట్లు జపించెను.

"మా పితరుల దేవుడవైన ప్రభూ ! నీకు స్తుతి కలునుగాక నీదివ్యనామమునకు కలకాలము కీర్తి కల్లునుగాక ఆకాశమును, నీవు చేసిన సృష్టియంతయు సదా నిన్ను కొనియాడునుగాక

6. నీవు ఆదామును సృజించితివి అతనికి భార్యగాను ఆదరువుగాను తోడుగాను ఉంటుటకై ఏవను జేసితివి వారి నుండియే మానవజాతి యుద్భవించెను ‘నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/22&oldid=237519" నుండి వెలికితీశారు