పుట:Thobithu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్కొక్కడును తొలిరేయి శోభనపు గదిలోనికి ప్రవేశింపగానే హతుడయ్యెను. కాని నాయనా! ప్రస్తుతము నీవు కొంచెము అన్నము తిని పానీయము సేవింపుము. ప్రభువే మిమ్మ కాపాడును" అని పలెను. తోబియా ఈ విషయమున నీవు నాకు మాట యిచ్చినదాక నేను అన్నపానీయములు ముట్టుకోనని చెప్పెను. రగూవేలు “సరియే, మోషే ధర్మశాస్రము ఆజ్ఞాపించినట్లే నేను సారాను నీ కిత్తును. స్వర్గములోని దేవుడు ఆమెను నీ దానినిగా నిర్ణయించెను. కనుక నీ వామెను స్వీకరింపవచ్చును. ఇప్పటి నుండి నీవామెకు భర్తవు, ఆమె నీకు భార్య. నేటి నుండి కలకాలము వరకును సారా నీకు ధర్మపత్ని యగును. స్వర్గాధిపతియైన దేవుడు ఈ రేయి మిమ్మిరువురిని కరుణతో కాపాడునుగాక" అని పలెను. 12 అంతట రగూవేలు సారాను పిలిపించి ఆ యువతి చేయిపట్టుకొని ఆమెను తోబియా కర్పించెను. "నేను ఈ పడుచును నీ కప్పగించుచున్నాను. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లే నీవు ఈమెను భార్యగా స్వీకరింపము. ఈమెను సురక్షితముగా మిరా యింటికి గొనిపొమ్మ స్వర్గాధిపతియైన దేవుని అనుగ్రహమువలన మిగా రిరువురును గలసి సుఖముగా జీవింతురుగాక” అని పల్కెను. 13. అటుపిమ్మట రగూవేలు భార్యను బిల్చి ఒప్పందమును వ్రాయుటకు పత్రమును తీసికొని రమ్మనెను. ఆమె పత్రమును తీసికొనిరాగా అతడు మోషే ధర్మశాస్త్రము ఆదేశించినట్లే సారాను తోబియా కిచ్చితిననిపెండ్లి యొడంబడిక వ్రాసెను.

14. అటుతరువాత వారు అన్నపానీయములు పుచ్చుకొనిరి. 15. రగూవేలు భార్యను పిల్చి ఖాళీగదిని సిద్ధముచేసి సారాను అచ్చటికి తీసికొనిపొమ్మని చెప్పను. 16. ఆమె భర్త చెప్పినట్లే ఆ గదిలో పడక సిద్ధముచేసి సారా నచటికి తోడ్కొనిపోయెను. ఎద్నా కొంచెము సేపు కూతురు మీద వాలి యేడ్చి కన్నీరు తుడుచుకొనెను. 17. "తల్లీ! ధైర్యముగా నుండుము. స్వర్గాధిపతియైన దేవుడు ఈసారి నీ దుఃఖమును సంతోషముగా మార్చునుగాక. నీ మట్టుకు నీవు గుండె దిటవు చేసికొనుము" అని చెప్పి తాను గది నుండి వెలుపలికి వచ్చెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/21&oldid=237518" నుండి వెలికితీశారు