పుట:Thobithu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎద్నాతో "చూచితివా! ఈ యువకుడు అచ్చముగా నా జ్ఞాతియైన తోబీతువలెనున్నాడు" అని యనెను. 3. ఆమె అతిథులను మిరెచటనుండి వచ్చితిరని ప్రశ్నించెను. వారు "మేము నఫాలి తెగకు చెందిన వారలము. ప్రస్తుతము నీనెవె పట్టణములో ప్రవాసమున నున్నారము" అని చెప్పిరి. 4. ఆమె మరల మా దాయాది తోబీతు మికు తెలియునా అని ప్రశ్నించెను. వారు అతడు మాకు బాగుగా తెలియును అని యనిరి. 5. ఆమె అతనికి కుశలమేనా అని యడుగగా వారు అతడు బ్రతికియే యున్నాడు, క్షేమముగానే యున్నాడు అని చెప్పిరి. తోబియా అతడు మా తండ్రియే అని చెప్పెను. 6. ఆ పలుకులు విని రగూవేలు తటాలునలేచి ఆనంద బాష్పములతో తోబియాను ముద్దాడెను. 7. అతడు ఆ యువకునితో "నాయనా! దేవుడు నిన్ను దీవించునుగాక. నీ తండ్రి ఉత్తముడు. అంతటి పుణ్యపురుషుడు, అన్ని సత్కార్యములు చేసినవాడు, చూపు గోల్పోవుట ఎంత దారుణము" అని పల్కుచు తోబియా మెడమిూద చేతులు వేసి అతని భుజముల మిూద వాలి బోరన ఏడ్చెను. 8. అతని భార్య ఎద్నా కొమార్తె సారా కూడ తోబీతు దుర్గతిని తలంచుకొని పరితపించిరి. 9. రగూవేలు అతిథులను హృదయపూర్వకముగా ఆహ్వానించెను. వారి కొరకు తన మందలలోనుండి యొక పొట్టేలిని గోయించి విందు సిద్ధము చేయించెను.

అతిథులు స్నానముచేసి భోజనమునకు కూర్చండబోవుచుండగా తోబియా "నేస్తమా అసరయా! నీవు సారాను నాకిచ్చి పెండ్లి చేయుమని రగూవేలు నడుగవా? "అని యనెను. 10. రగూవేలు ప్రక్కనుండి ఆ మాటలు విని తోబియాతో "నాయనా! మొదట విందారగించి పానీయము సేవింపుము. ఈ సాయంకాలమును సుఖముగా గడుపుము. మా యమ్మాయి సారాను పెండ్లియాడుటకు నీవు తప్ప మరి యెవరును అరులు కారు. నీవు మాకు అయినవాడవు. కనుక మా యమ్మాయిని మరియొకరికిచ్చు అధికారము నాకు లేదు. కాని నేను నీతో నిజము చెప్పవలయును. 11. నేను ఆమెను ఇదివరకే మా బంధువులకు ఏడురి కిచ్చితిని. వారిలో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/20&oldid=237517" నుండి వెలికితీశారు