పుట:Thobithu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరెత్తిపిలువగా అతడు చెప్పము నేను వినుచున్నాననెను. “నేటి రాత్రి మనము మిరా బంధువైన రగూవేలు నింట బస చేయవలయును. అతనికి సారా యను కొమార్త కలదు. ఆమె తప్ప అతనికి ఇతర సంతానములేదు. 11. ఆ కన్యనీకు దగ్గరి చుట్టము. కనుక అందరి కంటె గూడ అదనముగా నీ కామెను పెండ్లియాడు హక్కు గలదు. ఆమె తండ్రి ఆస్తియును నీకే దక్కును. 12. ఆ యువతి తెలివికలది. ధైర్యము కలది, చక్కనిది కూడ. సారా తండ్రి చాలా మంచివాడు. ఈ రాత్రియే నేనతనితో సారా వివహమును గూర్చి మాటలాడుదును. ఆమెను నీకు ప్రధానము చేయింతును. మనము రాగీసు నుండి తిరిగివచ్చునపుడు నీవా బాలికను వివాహమాడవచ్చును. రగూవేలు నీ వేడుకోలును త్రోసిపుచ్చి కూతురును మరియొకనికి ఈయజాలడు. అట్లు చేసినచో మోషే ధర్మశాస్త్రము ప్రకారము అతడు వధ్యుడగును. చుట్టరికమును బట్టి తన కొమార్తను పరిణయమాడుటకు నీకు ఎక్కువ యర్హత కలదని అతనికి తెలియును. కనుక ఇప్పడు నీవు నా మాట వినుము. ఈ రాత్రియే మేము వివాహ విషయమును ముచ్చటించి సారాను నీకు ప్రధానముచేయింతుము. మనము రాగీసునుండి తిరిగి వచ్చునపుడు ఆమెను మనతో ఇంటికి తీసికొని పోవచ్చును" అని యనెను. 13. తోబియా రఫాయేలుతో "నేస్తమా! ఆ యువతిని ఇదివరకే వరుసగా ఏడురు వరులకిచ్చి పెండ్లి చేసిరి. వారిలో ప్రతివాడు మొదటి రేయినే శోభనపు గదిలోనే చచ్చెను. ఈ సంగతులెల్ల నాకు తెలియును. 14. ఆమెను పట్టియున్న భూతమే ఆ వరులను సంహరించెననియు వింటిని. ఆ భూతము సారాకెట్టి హానియు చేయదట. ఆమెను సమిపించు పురుషులను మాత్రము పట్టి చంపనట. నా మట్టుకు నాకు ఆ పిశాచమనిన భయముగా నున్నది. వూ తండ్రికి నేనొక్కడనే కుమారుడను. చావవలయునను కోరికయు నాకు లేదు. నేను చనిపోయినచో మా తల్లిదండ్రులు దిగులుతో సమాధిచేరుకొందురు. అప్పుడు వారిని పాతిపెట్టు దిక్కుకూడ ఉండదు” అని యనెను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/18&oldid=237514" నుండి వెలికితీశారు