పుట:Thobithu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెరూషలేమునకు యాత్ర వెబ్లెడివారము. అచట ప్రభుని సేవించు కొనెడివారలము. నీబందుగులు మంచివారు. మిరా కుటుంబము యోగ్యమై నదే" అని పల్కెను.

14. తోబీతు ఇంకను" నేను నీకు పూటకొక్క రూకచొప్పన వేతనము చెల్లింతును. నా కుమారునకువలె నీకును దారిబత్తెము నిత్తును. నీవు నా తనయునితో కలసి పయనము చేయము. 15. కడన జీతమునే కాక మరికొంత సొమ్మను గూడ ముట్టజెప్పదును" అని పలెను. దేవదూత "నేను నీ కుమారునితో బోయెదను. నీవేమియు భయపడవలదు. మేమచటి కిని మరల యిచటికిని గూడ సురక్షితముగా ప్రయాణము చేయగలము. మార్గమున ఎట్టి అపాయము కలుగదు". అని పల్కెను. 16. తోబీతు దేవదూతతో దేవుడు నిన్ను దీవించుగాక అని యనెను. అటుతరువాత నతడు పుత్రుని బిలిచి "కుమారా! ప్రయాణమున కవసరమైన వస్తువులనెల్ల సిద్ధము చేసికొని నీ స్నేహితుని వెంట బొమ్మ స్వర్గమునందలి దేవుడు దారిలో మిమ్మ కాపాడునుగాక. అతడు మిమ్మల నిరువురిని మరల సురక్షితముగా నా చెంతకు తోడ్కొనివచ్చునుగాక. ప్రభువు దూత కూడ మిూతో పయనించి మికు బాసటగా నుండునుగాక” అనినుడివెను.

తోబియా తల్లిదండ్రులను ముద్దాడి మేదియాకు పయనము కట్టెను. తండ్రి యతనితో భద్రముగా ప్రయాణము చేయుమని చెప్పెను. 17. అప్పుడు తోబియా తల్లి అన్నా వెక్కివెక్కి యేడ్చుచు భర్తతో "నీవు నా బిడ్డను ఇట్లు పంపుదువా? వానిమిూద ఆధారపడిగదా మనము జీవించునది? ఇక మనకు దిక్కెవరు? 18. డబ్బు అంత అమూల్యమైనదా? దానికొరకు మన గారాబు బిడ్డ ప్రాణాములనే అపాయము పాలు చేయవచ్చునా? 19. దేవుడు మనకిచ్చిన దానితోనే సరిపెట్టుకొని ఈ బ్రతుకు నెట్టులైన ఈడ్వవచ్చును గదా?” అని వాపోయెను. 20. అందులకు తోబీతు "నీవు విచారింపకుము. మన బిడ్డడు సురక్షితముగాబోయి చెక్కుచెదరకుండ తిరిగి వచ్చును. వాడు భద్రముగా ఇల్లు జేరుటను నీ కంటితోనే చూతువు. కనుక నీవు వానిమిద

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/16&oldid=237512" నుండి వెలికితీశారు