పుట:Thobithu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీసికొనిరమ్మ అతడు ఏ తెగకు, ఏ కుటుంబమునకు చెందినవాడో తెలిసికొందును. నీకు నమ్మదగిన నేస్తుడౌనోకాదో గూడ పరిశీలించి చూతును" అని నుడివెను. కనుక తోబియా బయటికి వెళ్లి మా తండ్రి నిన్ను చూడగోరుచున్నాడని చెప్పి రఫాయేలును పిల్చుకొని వచ్చెను.

10. రఫాయేలు ఇంటిలోనికి రాగానే తోబీతు అతనికి స్వాగతము చెప్పెను. దేవదూత నీకు కుశలమేనా యాని అడిగెను. తోబీతు "బాబూ! నాకు కుశలమెక్కడిది? నేను కన్నులు లేని కబోదిని. చనిపోయినవారివలె నేనును వెలుగును చూడజాలకున్నాను. నా బ్రతుకు సజీవసమాధివలె నున్నది. నరులు మాలటాడుట విందును గాని వారి రూపమును మాత్రము చూడజాలను" అని యంగలార్చెను. రఫాయేలు "అయ్యా! విచారింపకుము. దేవుడు శీఘ్రముగనే నీకు చూపు దయచేయును" అని చెప్పెను. తోబీతు "నా కుమారుడు తోబియా మేదియా దేశమునకు వెళ్లవలయును. నీవు అతనికి తోడుగా వెళ్లి మార్గమును చూపింపగలవా? మేము వేతనము చెల్లింతుము" అని యడిగెను. దేవదూత నేనతనితో తప్పక వెళ్లేదను. నేను మేదియాకు చాలసారులు వెళ్లితిని. ఆ దేశమునందలి కొండలలోను మైదానములలోను తిరిగితిని. అందలి దారులన్నియు నాకు తెలియును" అని పలెను. 11. తోబీతు "నాయనా! నీది ఏ తెగ? ఏ కుటుంబము?" అని యడిగెను. రఫాయేలు నా తెగతో నీకేమి యవసరము అని యనెను. తోబీతు నీవెవరి కుమారుడవో, నీ పేరెద్దియే నేను రూఢిగా తెలిసికోగోరెదను అని యనెనె. 12. దేవదూత నా పేరు అసరయా. నేను నీచుట్టమైన పెద అననియా కుమారుడను అని చెప్పెను. 13 తోబీతు కుమారా! నీకు స్వాగతము. నేను నీ కుటుంబమును గూర్చి తెలిసికోగోరినందుకు నీవు అన్యథా భావింపవలదు. నీవు మంచి పరపతికల కుటుంబమునకు చెందినవాడవు. మాకు అయినవాడవుకూడ. పెదపెమయా కుమారులగు అననియా, యాతాను నాకు బాగుగా తెలియుదురు. వారు ప్రభువు ఆజ్ఞలను తూచ తప్పకుండ పాటించెడ్డిస్తారు. మేమందరము కలిసియే

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/15&oldid=237511" నుండి వెలికితీశారు