పుట:Thobithu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీసికొంటిని. అతని ముక్కను సొమ్ముతో జేర్చియుంచితిమి. ఇరువది యేండ్లనాడు ఈ సొమ్మను అతని వద్ద దాచితిని. కుమారా! ఇప్పుడు నీతో పాటు మేదియాకును అచటి నుండి మరల యిచటికిని ప్రయాణము చేయుటకు అంగీకరించు నేస్తు నొకనిని వెదకి తెచ్చుకొనుము. నీవు తిరిగివచ్చు రోజువరకును అతనికి వేతనము చెల్లింతము. నీ వతనితో బోయి గబాయేలు నొద్దనుండి ఆ సొమ్మను తీసికొనిరావచ్చును" అని చెప్పెను.

4. కనుక తోబియా తన్ను మేదియాకు తీసికొనిపోవు నేస్తుని వెదకబోయెను. బయటికి వెళ్ళగానే రఫాయేలను దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యెను. కాని తోబియాకు అతడు దేవదూతయని తెలియదు. 5. కనుక తోబియా అయ్యా! మిడేయూరు అని అతని నడిగెను. రఫాయేలు "నేను గూడ యిస్రాయేలీయుడనే. పనియేమైన దొరుకునేమో యని ఈ పట్టణమునకు వచ్చితిని" అని యునెను. నీకు మేదియాకు దారి తెలియునాయని తోబియా ప్రశ్నించెను. 6. రఫాయేలు తెలియకేమి? నేనచటికి చాలసారులు వెళ్లితిని. అచటికి పోవు దారులన్నియు సుపరిచితములే. నేనా దేశనమునకు బోయినపుడెల్ల రాగీసు నగరమున వసించు మా బంధువు గబాయేలునింట బస చేసెడివాడను. ఎక్బటానానుండి రాగీసును చేరుకొనుటకు రెండు నాళ్ళు పట్టును. ఎక్భటానా మైదానములలో నున్నది. రాగీసు కొండలలోనున్నది" అని పల్కెను. 7. తోబియా "చెలికాడా! నేను మా తండ్రితో ఈ సంగతి చెప్పి వచ్చెదను. నీవు కొంచెము సే పిక్కడనే నిలువుము. నీవు నా వెంట ప్రయాణము చేయవలయును. మేము నీకు వేతనము చెల్లింతుము" అని యనెను. 8. ఆ మాటలకు రఫాయేలు “సరియే. నీవు కోరినట్లే నేనిచట వేచియుందును. కాని నీవు మాత్రము జాగుచేయవద్దు" అని యనెను.

9. తోబియా తండ్రి చెంతకుబోయి నాతో ప్రయాణము చేయుటకు మన జాతివాడొకడు దొరికెనని చెప్పెను. తండ్రి అతని నిచటకు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/14&oldid=237510" నుండి వెలికితీశారు