పుట:Thobithu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయుము. ఎక్కువగా నున్నచో ఎక్కువగానే యిమ్మ తక్కువగా నున్నచో తక్కువగానే యిమ్ము. కాని యిచ్చుటలో మాత్రము ఎప్పడును వెనుకాడకుము. 9. ఇచ్చిన యీవి ఆపత్కాలమున పెద్ద నిధివలె సాయపడును. 10-11. దానము మోక్షము నందలి దేవునికి ఇష్టమైన కానుక. దానము చేయువానిని అతడు అంధకారబంధురమైన మృత్యు లోకము నుండి రక్షించును.

12. నాయనా! వేశ్యలను గూర్చి జాగ్రత్తగా నుండుము. మన తెగనుండియే యొక పిల్లను పెండ్లిచేసికొనుము. మన తెగకు చెందనివారి పిల్లలను పరిణయమాడకుము. మనము ప్రవక్తల వంశమున బుట్టితిమి. మన పూర్వులైన నోవా అబ్రాహాము ఈసాకు యాకోబు మొదలైన వారందరును వారి తెగకు చెందిన పిల్లలనే పెండ్లియాడిరి. కనుక దేవుడు వారికి సంతానమును దయచేసెను. ఆ సంతానము యిప్రాయేలు దేశమును భుక్తము చేసికొనెను. 13. కావున నీవును మన తెగకు చెందినవారిని ఆదరింపుము. మనవారి పిల్లలలో నొకతెను పెండ్లియాడుము. గర్వముతో మన బంధువుల బాలబాలికలను చిన్నచూపు చూడకుము. గర్వము విచారమును వినాశమును దెచ్చిపెట్టును. సోమరితనము పేదరికమును గొనితెచ్చును. లేమికి కారణము సోమరితనమే.

14. నీకు పనిచేసినవారి కూలిని ఏరోజు కారోజు చెల్లింప వలయునేకాని మరుసటి దినమువరకు అట్టిపెట్టుకోరాదు. నీవు ఈ నియమమును పాటించి దేవుని గౌరవింతువేని అతడు నిన్ను బహూ కరించును. నీ పనులన్నింటను జాగ్రత్తగా నుండుము. ఎల్లవేళలను సక్రమముగా ప్రవర్తింపుము. 15. ఇతరులు ఎట్టి కార్యమును చేసిన నీకు అప్రియము కలునో అట్టి కార్యమును నీ వితరులకు చేయరాదు. నీవు ద్రాక్ష సారాయమును తప్పత్రాగి మత్తుడవు కావలదు. త్రాగుడు అను వ్యసనమునకు లొంగిపోవలదు.

16. ఆకలి గొనినవారికి శ్రీ పెట్టుము. బట్టలు లేనివారికి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Thobithu.pdf/12&oldid=237508" నుండి వెలికితీశారు