పుట:Thittla gnanam.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గురువు : అవినాశ్‌ అనునది శరీరమునకు పెట్టిన పేరే కదా! జీవునకు సరిపోవునా?

శిష్యులు : శరీరమునకు సరిపోదు స్వామి. జీవునకు సరిపోతుంది.

గురువు : శరీరమునకు ఎందుకు సరిపోదు?

శిష్యుడు : శరీరము కొంతకాలముండి నశించి పోవునదే కదా! నశించి పోవునది శరీరము. శరీరము నశించినప్పటికి నశించకున్నది జీవుడు, కావున జీవునకు అవినాశ్‌ అన్న పేరు సరిపోవును. కాని శరీరమునకు ఆ పేరు సరిపోదు.

గురువు : భగవద్గీతలో జీవుడు నశించువాడే అని చెప్పారు. అలాంటపుడు ఆ పేరు జీవునికి కూడ సరిపోదు. జీవుడు కూడ నశించువాడే. శరీరము మరణముతో నశిస్తున్నది. మరణములో జీవుడు నశించడను మాట వాస్తవమే. మరణించిన తర్వాత జీవుడు మరొక శరీరమును ధరించి సజీవునిగానే ఉండును. ఆయుస్సు అయిపోతే శరీరము నశించును. కర్మ అయిపోతే జీవుడు నశించుననునది సూత్రము. కర్మ అయిపోయినపుడు జీవునికి నాశనము తప్పదు, కావున అవినాశ్‌ అనుపేరు అర్థము ప్రకారము జీవునికి కూడ వర్తించదు.


ఈ విధముగ గురువు దగ్గర ఆత్మజ్ఞానము తెలుసుకొంటున్న శిష్యులు కొన్ని సంవత్సరములకు పరిపూర్ణ జ్ఞానులై గురుసేవ సక్రమముగ చేయుచుండిరి. శిష్యులు జ్ఞానమునందు ఆసక్తి కల్గియుండి జ్ఞానమును తెలుసుకోవడము మరియు వారు శ్రద్ధగ సేవలు చేయడమును గమనించిన గురువు సంతోషించుచుండెను. ఇలా కొంత కాలము గడువగ ఒకనాడు అవినాశ్‌ అను శిష్యుడు భక్తి శ్రద్ధలతో గురువు పాదాలకు సమస్కరించు సమయమున గురువుగారు ఒక దీవెనను తననోటినుండి పలికెను. ఆ