పుట:Thittla gnanam.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతానప్రాప్తిరస్తు

అశుభజీవితము గడుపుటలో లగ్నమైనవానికి మరొక అశుభమును సూచించు తిట్టు దీవెనరూపములో గలదు. అదియే "సంతానప్రాప్తిరస్తు లేక శ్రీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు" వీటి అర్థము నీకు సంతానము కలుగుగాక అనడము. భార్యరాకతో దైవమార్గమంటే ఏమిటో తెలియక దాని ధ్యాసలేకుండ పోయిన భర్తకు, అదే విధముగ భర్తరాకతో దేవుని విషమేమిటో తెలియక దాని ధ్యాసకూడ లేకుండ పోయిన భార్యకు సంతానముతో కాలమంత వారికే వినియోగమగుట చేత ఏమాత్రము దైవమును తెలుసుకొను అవకాశమే లేకుండ పోవును. భార్యకు లేక భర్తకు సంతానము వలన ప్రపంచములో లగ్నమగుటకు అవకాశము ఎక్కువగుచున్నది. అందువలన కొందరు జ్ఞానులు తమ పాటలలో ఆలు మాయ, పిల్లలు మాయ అన్నారు. మాయ దేవునికి వ్యతిరిక్త దిశలో నడిపించునది. ఆలు పిల్లలు దైవమార్గ మునకు ఆటంకములే కావున వారిని మాయ అన్నారు. సంతాన ప్రాప్తిరస్తు అనగా నీవు ఇంకా మాయలో కూరుకపొమ్మని చెప్పినట్లున్నది, కావున ఈ వాక్యమును దూషణ పక్షములోనికే చేర్చడమైనది. "పుత్ర ప్రాప్తిరస్తు" అనిన "సంతాన ప్రాప్తిరస్తు" అనిన రెండు ఒకే విధానమును తెల్పుచున్నవి. ఈ వాక్యములు సంతానములేని వారికి గాని, పుత్రుడు లేనివారికి గాని సంతోషమును కల్గించును. అయినప్పటికి దైవజ్ఞానరీత్య అంత సంతోషింపదగిన విషయములేమి కావు.


పైకి మేలు చేసినట్లు కన్పించు వాక్యములు దీవెనలరూపములో అప్పటికి సంతోషమును కలుగజేయునవై ఉన్నప్పటికి వాటివలన అశుభమే చేకూరును. కావున దీవెనలవలె కన్పించు వాక్యములను దూషణలుగ చెప్పుచున్నాము. అలాగే పైకి కీడుచేయునట్లు కన్పించు వాక్యములు ఇప్పటి