పుట:Thittla gnanam.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువులుగ స్వాములుగ ఉన్నవారు తమకు పాదాభివందనము చేసినవారికి చెడుకల్గునట్లు శత్రువులవలె దూషణలివ్వడము, శత్రువులైన వారికి మిత్రులవలె శ్రేయోభిలాషులవలె దీవెనలివ్వడము జరుగునంటే ఎవరికైన విచిత్రమనిపించును కదా! ఆ విచిత్రమే నేడు భూమి మీద మనకు తెలియకుండానే జరుగుచున్నది. స్వాములు దూషిస్తున్నారు, శత్రువులు దీవిస్తున్నారు. తిట్లేవో దీవెనలేవో తెలియక పోవడమే దీనికి కారణమని చెప్పవచ్చును. తిట్లు దీవెనల తారతమ్యము ఎవరికి తెలియక పోవడము వలన స్వాములు తిట్లను, శత్రువులు దీవెనలను ఇస్తున్నారు. ఈ వక్రపద్ధతి లేకుండ పోవాలంటే తిట్లను గూర్చి, దీవెనల గూర్చి, విశదముగ తెలియవలసిన అవసరము గలదు. దూషణ, భూషణ వివరమును తెలుపుటకు, తిట్లలోగల జ్ఞానమును దీవెనలలో గల అజ్ఞానమును తెలియ జేయుటకు "తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము" అను ఈ చిన్న గ్రంథమును వ్రాయడము జరిగినది.


నేటి తిట్లలో జ్ఞానమున్నదనిన, దీవెనలలో అజ్ఞానమున్నదనిన ఇదేమి విడ్డూరమని కొందరనుకోవచ్చును. పూర్వము జ్ఞానసంబంధమైన దీవెనలు నేడు తిట్లుగ మారినవి. అలాగే పూర్వము అజ్ఞాన సంబంధమైన దూషణలు నేడు దీవెనలుగ మారినవి. కావున ఈనాటి తిట్లలో ఉన్న సదుద్దేశమేమిటో అలాగే దీవెనలలో ఉన్న దురుద్దేశమేమిటో వివరించుకొని చూద్దాము.

-***-


నీవు నాశనమైపో

ఎవరైన ఆడవారు పోట్లాడుకొనేటపుడు "నీవు నాశనమైపోనాని" అని ఎదుటివారిని అనడము ఆక్కడక్కడ వినియే ఉందుము. నేడు ఈ