పుట:Thittla gnanam.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇష్ఠార్థ ఫల సిద్దిరస్తు

ఈ పద్ధతి ప్రకారమే మరికొన్ని తిట్లు నేడు దీవెనలరూపములలో అక్కడక్కడ వినిపిస్తున్నవి. వాటిలో "ఇష్ఠార్థ ఫలసిద్ధిరస్తు" అను ఒకదానిని వివరించుకొందాము. మానవునికి ఇష్టము రెండురకములుగ ఉండును. ఇష్టము అనునది మానవునికున్న గుణము కానేకాదు. అట్లని జ్ఞానము కాదు. గుణములపట్ల ఉన్న శ్రద్ధను ఇష్టము అంటున్నాము. గుణములు ప్రపంచవిషయములకు సంబంధించినవి, కావున గుణములలోనున్న శ్రద్ధను విషయశ్రద్ధని అంటున్నాము. అదే విధముగ గుణముల సంబంధము లేకుండ దైవజ్ఞానము మీదగల ఇష్టమును జ్ఞానశ్రద్ధ అంటున్నాము. ఈ విధముగ ఒకటి విషయశ్రద్ధ, రెండు జ్ఞానశ్రద్దని మొత్తము రెండు రకములు గలవు. మనిషికి 'శ్రద్ధ' లేక 'ఇష్టము' అనునది గుణము కాదు, కావున అది కర్మననుసరించి వచ్చునదికాదు. మానవునికి జన్మతః కల్గిన హక్కు శ్రద్ధ. మనిషి విషయశ్రద్ధనుగాని లేక జ్ఞానశ్రద్ధనుగాని స్వతహాగా ఏకర్మప్రమేయము లేకుండ కల్గియుండ వచ్చును. జ్ఞానశ్రద్దను బట్టి జ్ఞానము లభించును, కావున 'శద్ద్రవాన్‌ లభతే జ్ఞానమ్‌' అని భగవద్గీతలో చెప్పారు. జ్ఞానశ్రద్ధ ఉన్నవానికి శ్రద్ధను బట్టి జ్ఞానము లభించునుగాని, విషయశ్రద్ధను బట్టి విషయములు నెరవేరుననుకోకూడదు. కర్మలిఖితములో జ్ఞానముండదు, కావున శ్రద్ధయున్నంత జ్ఞానము లభించును. కర్మలిఖితములో విషయ ప్రాప్తము అప్రాప్తములుండును, కావున శ్రద్ధయున్నంత మాత్రమున విషయములు నెరవేరుననుటకు వీలులేదు. ఉదాహరణకు ఒకనికి ఆహారపదార్థములలోకెల్ల లడ్డుమీద ఎక్కువ ఇష్టముండవచ్చును. అయినంత మాత్రమున లడ్డువానికి లభించునని చెప్పుటకు వీలులేదు. ఏపూట ఏ ఆహారము తినవలెనని కర్మప్రకారము వ్రాసిపెట్టబడియుండునో ఆ విధముగనే వానికి ఆహారము లభించును. దీనినిబట్టి శ్రద్ధ రెండు