పుట:Thittla gnanam.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోరుకొన్న కోర్కెలు జన్మాంతరమున నెరవేరునని చెప్పినట్లు గుణంజయ కోర్కె స్వామీజీ వాక్యము ప్రకారము మరుజన్మలో నెరవేరినది. అది ఏవిధముగ నెరవేరిందంటే! గుణంజయ మరుజన్మలో ధనంజయ అను పేరు కల్గియుండెను. ఒకరోజు అతను రైలు ప్రయాణము చేయుచుండెను. తనతో ప్రయణము చేయువారిలో ఒకరితో ధనంజయకు రైలులో పరిచయమేర్పడినది. వారు చాలాదూరమునుండి ఒకరోజంత ప్రయాణము చేయుటవలన మరియు ఒకే స్టేషన్‌లో ఇద్దరు దిగవలెను కావున కొంత ఎక్కువ స్నేహముగ ఉండిరి. సాయంకాలము ఆరుగంటల సమయములో రైలుమార్గమున గల వంతెనలో లోపమేర్పడుట వలన రైలును వంతెన ఇవతలనే ఆపివేశారు. మార్గము రిపేరు చేయుటకు ఆరాత్రంత సరిపోవునని తెల్లవారిన తర్వాతనే రైలు బయలుదేరునని రైల్వే సిబ్బంది తెలిపారు. ధనంజయ అతని సహప్రయాణికుడు దిగవలసిన స్టేషన్‌ తర్వాత వచ్చు స్టేషన్‌ అగుటవలన మరియు వారి గమ్యము కేవలము నాలుగు కిలోమీటర్లే అగుట వలన వారు ఆ కొద్ది దూరమును నడచి చేరుకోవాలనుకొన్నారు. వారు నడువవలసిన మార్గము కాలిత్రోవ అగుటవలన, అదియు అడవి మార్గమగుట వలన తోటి ప్రయాణికుడు ధనంజయతో నావద్ద ఐదులక్షల డబ్బున్నది దారిలో దొంగలుండరు కదా అని అడిగాడు. మనమొస్తామని ఎవరికి తెలుసు? నీ దగ్గర డబ్బున్నదని ఎవరికి తెలుసు? చీకటి పడకముందే ఊరు చేరవచ్చును అని జవాబుగ ధనంజయ అన్నాడు. దగ్గర కదా వెళ్లి పోవచ్చును లేకపోతే రాత్రంత రైలులో జాగారము తప్పదని అనుకొన్నవారు చివరకు కాలినడక పోవాలనుకొన్నారు. ఇద్దరు రైలుదిగి నడువను ప్రారంభించారు. ఒక కిలోమీటరు నడచిన తర్వాత ధనంజయ తలలో ఆలోచనలు మెదలసాగెను. పూర్వము కోరుకున్న కోర్కె ప్రకారము