పుట:Thittla gnanam.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా చవితి

ఒక భర్తకు ఇద్దరు భార్యలున్నపుడు మొదటి భార్య, రెండవ భార్యను నాచవితి అని అంటుంది. అలాగే రెండవ భార్య, మొదటి భార్యను నాచవితి అని అంటుంది. ఈ విధముగ ఇద్దరు భార్యలు లేక ఎక్కువమంది భార్యలున్న చోట భార్యలందరు ఒకరుకొకరు చవితి, నాచవితి అనుకోవడము పరిపాటిగా ఉన్నది. ఇక్కడ ఒక విశేషమేమంటే, భార్యలందరు ఒకరుకొకరు ప్రేమగా ఉండు సమయములలో అక్కా, చెల్లీ అని చిన్న పెద్దను బట్టి ప్రేమగా పిలుచుకొనుచుందురు. ఒకవేళ వారిమధ్యలో వైషమ్యాలూ, అభిప్రాయబేధములూ ఉన్నపుడు వారిమధ్యలో ప్రేమ ఉండదు. ఒకరుకొకరు అసూయ కల్గియుందురు. అటువంటి సమయములలో ఆమె నాకు అక్క అనిగానీ, ఈమె నాకు చెల్లి అనిగానీ చెప్పుకోరు. అది నాచవితి అనీ, ఇది నా చవితి అని అంటుంటారు. ఇంకా కొందరు పోట్లాడుకొను సమయములో నీవు నాచవితివే అనియో, లేక నాచవితి అని తిట్టుకొనుచుందురు. ఈ విధముగా "నాచవితి" అనుమాట తిట్ల జాబితాలోనికి చేరిపోయినది.


పూర్వము కృతయుగము, త్రేతాయుగములలో "నా చవితి" అను మాట గొప్ప జ్ఞానముతో కూడుకొని ఉండెడిది. పూర్వము దైవజ్ఞానముగా ఉన్నమాట ఈ కాలములో తిట్టుగా మారిపోయినది. కావున తిట్టులో జ్ఞానమున్నదని మనము ఈ రోజు చెప్పుకోవలసి వచ్చినది. తిట్లజ్ఞానములో నా చవితి అను పదమునకు ఏమి జ్ఞానమున్నదో అని యోచిస్తే మరియు ఆలోచిస్తే, ఆ రహస్యము ఈ విధముగా తెలియబడుచున్నది. చాతుర్వర్ణమ్‌ అను పదము భగవద్గీత జ్ఞానయోగములో 13వ శ్లోకమున చెప్పబడినది. చాతుర్వర్ణమ్‌ అను పదములో చతుర్‌, వర్ణమ్‌ అను రెండు పదములు కలిసి యున్నవి. చతుర్‌ అనగా నాలుగు అని అందరికి తెలుసు. ఇకపోతే వర్ణమ్‌ అను పదమును గురించి యోచిస్తే, వరస అను శబ్దము నుండి