పుట:Thittla gnanam.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారి వయస్సు 80 సంవత్సరములైనది. వృద్దాప్యమంటే ఏమిటో, అనారోగ్యమంటే ఏమిటో బాగా అర్థమైనది. చివరికి జీవితమంటే ఏమిటో అర్థమైనది. మానవునికంటే పశు, పక్షుల జన్మలే మేలనిపించింది. ఈ విధముగ బ్రతకలేక చావురాక దినమొక యుగముగ గడుపుచున్నపుడు వారి ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడు. కొడుకుల ఆహ్వానము ప్రకారము ఇంటికి వచ్చిన స్వామీజీ గొప్ప జ్యోతిష్యుడు కూడా. ముఖము చూచినంతనే జరిగినది జరుగబోవునది చెప్పగల దిట్ట. ఆ స్వామీజీ విషయము తెలుసుకొన్న లెక్కాచారి స్వామి బయటికి పోవునపుడు ఆయన కాళ్ళను గట్టిగ పట్టుకొని నేను తొందరగ చనిపోవునట్లు దీవించమన్నాడు. ఎందుకని స్వామి అడుగగ, వృద్దాప్యము చాలా దుర్భరమైనదని తాను బ్రతకలేకున్నానని, నేనుండి చేయునదేమి లేదని, చస్తామనుకొంటే చావురావడములేదని, నాకు కావలసినది చావు కావున అది వచ్చేటట్లు ఈ శరీరము వీడిపోయేటట్లు దీవించమన్నాడు. అందులకు ఆ స్వామి నవ్వి "మానవ జీవితము కొంతకాలమే అందమైనదని తర్వాత దుర్భరమైనదని తెలియక, పోయిన జన్మలో పరమార్థమును బోధించిన గురువుకే మోసము చేశావు. ధనము విలువ తప్ప జ్ఞానధనము విలువ తెలియని నీకు ఆ గురువుగారు ఇచ్చిన దీవెనయే నీపాలిటి శాపమైనది. ఆ దినము నీకు దీవెనగ అర్థమైన అది నీకు దుశ్శకునమే. దైవజ్ఞానమునకు విలువివ్వక జీవితములో ధనమునకే విలువిచ్చి గురువునే మోసగించిన నీకు 'దీర్గాయుస్మాన్‌ భవ' అని శపించడము జరిగినది. ఆ వాక్కు ఫలితమే ఎంతరోగమున్న సంపూర్ణముగ నూరు సంవత్సరములు బ్రతుకవలసి ఉన్నది. ఇదియే నీ భవిష్యత్తు" అని చెప్పాడు. ఆ మాటతో లెక్కాచారికి పోయిన జన్మ లెక్కాచారమేమిటో తెలిసినది. తనకు పరిష్కారమే లేదా అని స్వామీజీని