పుట:Thittla gnanam.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిట్ల జ్ఞానము -దీవెనల అజ్ఞానము

మనిషి తన జీవితములో సుఖములనే కోరుకుంటాడు. కష్టములను వద్దనుకుంటాడు. తనకు ఏ చిన్న కష్టమొచ్చిన అది లేకుండా పోవలెనను తలంపు తనలో పుట్టుకవస్తుంది. తను తలచినంత మాత్రమున ఆ కష్టము పోదని తెలిసిన మనిషి ఇతరుల సహాయము కోరడము సహజము. ఇతర మనుషుల వలన కూడ తొలగని కష్టమును గురించి మనుషులకంటె గొప్పవాడైన దేవున్ని అర్థించడము మనిషికి అలవాటై పోయినది. అలా కష్టాల్లో ఉన్నవారు ఉన్న కష్టము పోవాలని కొందరు, ఏ కష్టములేనివారు తమకున్న సుఖముతో సంతృప్తిచెందక క్రొత్త సుఖములు కావలని కొందరు దేవున్ని కోరుకొనుచుందురు. ఇలా కోరడము రెండు రకములుగ ఉన్నది. ఒకటి మనిషి సాటిమనిషిని కోరడము, రెండవది మనిషి దేవున్ని కోరడము. కోరే కోర్కెలు కూడ రెండురకములుగ గలవు. ఒకటి ఉన్నది పోవాలని కోరడము, రెండవది లేనిది రావాలని కోరడము, దీనిని బట్టి మనిషి కోర్కెలు రెండు విధములని, కోరే విధానములు కూడ రెండు విధములేనని తెలియుచున్నది.


మానవుడు ఆశాజీవి కావున కోరడము వాస్తవమే. తీర్చేవాడైన మరొక మనిషి తర్వాత దేవుడు వాస్తవమా కాదా అన్నది ప్రశ్న. మనిషి మరియు దేవుడు వాస్తవమే అయినప్పటికి కోర్కెలు తీర్చేవిషయములో ఎవరికెంత పాత్ర ఉన్నదో చెప్పలేము. మనిషి తన కోర్కెల నిమిత్తము తోటి మనిషిని, ఎదుటి దేవున్ని గౌరవించడము జరుగుచున్నది. తన పని కోసము లేక కోర్కె కొరకు ఇంకొకరిని గౌరవించడములో కొన్ని పద్ధతులు మనిషి అవలంభించుచున్నాడు. ఆ పద్ధతులలో ఒకటి పొగడడము, రెండు భజనచేయడము, మూడు నమస్కరించడము, నాలుగు ఆరాధించడము (పూజించడము). ఒక పనినెరవేరుటకు పలానా వాని వలన ఈ పని