పుట:Thimmarusumantri.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

తిమ్మరుసు మంత్రి


గూడ రాజు శిక్షించు" నన్న భయముచేత మరలి పోయి యావృత్తాంతము నంతయుఁ దెలిపిరి. కృష్ణదేవరాయఁడు తిమ్మరుసుకడనే విద్యాబుద్ధులు నేర్చిన బుద్ధిమంతుఁడు గావున నతఁడు తనయాజ్ఞ నుల్లఘించువాఁడు కాఁడని తాను బాగుగా నెఱింగినవాఁడు గావున నతఁడు చేయుచున్నపని తననిమిత్తమే యని గ్రహించి యందలి రహస్యమును దెలిసికొని తన కనుమానము గలిగించిన పెద్దసామంతులను దొలఁగించి వారిస్థానమున విశ్వాసపాత్రులైన చిన్నసామంతులను నియమించి యాజ్ఞాపత్రముల నొసంగి వెంటనే మీయధికారములను జెల్లింపుఁడని యాజ్ఞచేసి యంతఃపురమందిరమునకుఁ బోయెనఁట ! వారును వానిం గైకొని తమకు వలయు సేనాసహాయముతోఁ బోయి యొకరివర్తమాన మొకరికిఁ దెలియకుండఁ బెద్దసామంతులను దొలఁగించి వారిస్థానముల నాక్రమించుకొనిరఁట ! ఈ వృత్తాంతములను దెలిసికొని పరరాష్ట్ర ప్రభువులు నిరుత్సాహులై యుద్ధప్రయత్నమును మానుకొని రఁట! కృష్ణదేవరాయని సామర్థ్యమును బ్రజలు బహుభంగులఁ గొనియాడు చుండిరి. తిమ్మరుసు బుద్ధివిశేషమును రాయం డభినందించెనఁట. ఈకథ యెట్టిదైనను అనుమానాస్పదమైన వర్తనముగల సామంతులను దొలఁగించి యాస్థానముల విశ్వాసపాత్రులైన సామంతులను నిలిపి ముందు రాఁబోవు నుపద్రవమునుండి సొమ్రాజ్యమును తన నేర్పరితనముచేత తిమ్మరుసు సంరక్షించి