పుట:Thimmarusumantri.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(14)

షష్ఠప్రకరణము

87


తనరాజ్యభారమునంతయును తిమ్మరుసుమంత్రిపై నిడి విద్యా వినోదములం దగుల్కొని ప్రమత్తుఁడై యున్నవాఁడని కొందఱు సామంతప్రభువు లపవాదములు పుట్టింప శత్రురాజులు వానిని విశ్వసించి వారివలన రాయని రాజ్యములోని రహస్యముల గ్రహింపుచు రాయని జయించి వారికి స్వాతంత్ర్య మొసంగెదమని వాగ్దానమునుజేసి సమరసన్నాహములను జేయుచుండిరి. ఈవర్తమానము రాయనికి ముందుగాఁ దెలియవచ్చెను. అప్పుడు వెంటనే కృష్ణదేవరాయఁడు సమయముకాని సమయమైనను తిమ్మరుసును తన సమ్ముఖమునకు రమ్మని వర్తమానము చేసెను. తిమ్మరుసు జపము చేసికొనుచుండగా రాజభటులు వచ్చి రాయనియాజ్ఞను దెలిపిరి. అతఁడు బుద్దికౌశలము గలవాఁడు గావున రాయనితలంపు గ్రహించి జపమును మాని దిగ్గునలేచి యిదె వచ్చెదనని రాజభటులకుఁ దెలిపి యొక దొడ్డిలోనికిఁ బోయెను. రాజభటులును వానిని వెంబడించి పోయిరి. అతఁ డొక తోటకూరమడిలోఁ గూరుచుండి పెద్దపెద్ద మొక్కలను బెకలించి దూరముగాఁ బడవైచుచు, చిన్నమొక్కల జుట్టును మళ్ళుగట్టి సమీపమున నున్న బావిలో నుండి యుదకమును చేది దానిం దెచ్చి యాచిన్న మొక్కలను దడుపుచుండె నఁట! దీని నంతయును జూచిన రాజభటు "లీతఁడు రాజాజ్ఞోల్లంఘన చేయఁదలంచి కాలయాపనకై యీపని పెట్టుకొన్న ట్లున్నది; వెంటనే పోకయున్న మనలను