పుట:Thimmarusumantri.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

తిమ్మరుసు మంత్రి


ఓమంత్రిపుంగవా! అఘటనాఘటనసామర్థ్యము గల మీవంటి యమాత్యశేఖరు లుండఁగా నిర్విచారముతో మేము యథేచ్ఛాసంచారముఁ జేసినఁ బ్రమాద మేమియుండును ? మీరసామాన్యశక్తిసంపన్ను లగుటంజేసి మీరు తలంచిన పక్షమునఁ దృణము మహామేరు వగును. మీరు కాదన్నచో మహామేరువే తృణ మగును. మీవంటి మహాత్ములు మంత్రులుగా మాకు లభించుట మాపూర్వజన్మభాగ్యము గాని మఱి యొండుకాదు.

ఇట్లు కృష్ణదేవరాయఁడు పలుక నాతని షూటల చమత్కారమునకు మనస్సులో నుప్పొంగుచు తిమ్మరుసు మరల యిట్లనియెను,

దేవా! మే మన నెంతవారము. ప్రభువు నాజ్ఞావిధుల ననుసరించి భయభక్తులతోఁ బ్రవర్తింపవలసినవారము. తృణ గ్రాహియైన నీలమున కెచ్చటను విలువ యధికమే యగును; కాని యది కేవలము తృణమని దానిని గ్రహింపరాదని విడిచినంతమాత్రమున నయ్యది జాతినీలము కానట్లు ప్రభువులు పరిగ్రహించినఁ బ్రజలే సమ్మానార్హు లగుదురు. దేవరవారి ప్రతాపము మూలముసఁ గాని యన్యథా సమర్దత యేలగలుగును ? ఏలిక యాజ్ఞాప్రకారము కార్యములు నడచును. దేవా ! మీయాజ్ఞ యెట్లో అట్లే సమస్తకార్యములు నిర్వహింతుము. దేవరవారింక నగరమునకు విచ్చేయవలయు. అని వినయనయ