పుట:Thimmarusumantri.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

తిమ్మరుసు మంత్రి


అట్లనుగ్రహింపు' మని వేడుకొనియెను. ఔదార్యగుణశీలుఁడైన యామహాప్రభువు మంత్రిశేఖరుని ప్రార్థనమును మన్నించి యాతఁడు చెప్పినట్ల వారలను జెఱ విడిపించి కరుణార్ద్రహృదయుఁడై చంద్రగిరి దుర్గమునకుఁ బంపించి కొంత రక్షణసైన్యము నుంచి వారల జీవనార్థము కొంత దేశముపై రాఁగలఁరాఁబడి నొసంగి జనస్తుతికిఁ బాత్రుడయ్యెను.

తిమ్మరుసు కార్యనిపుణత్వము

ఎన్నఁడు స్వప్నమునందైన నెదురుచూడని మహాసమస్య యొకటి భయంకరమైన స్వరూపముదాల్చి తిమ్మరుసు నెదుర్కొనియెను. చిన్ననాఁటనుండియుఁ బెంచినవాడు తిమ్మరుసు మంత్రియైనను నాతనికిఁ దెలియకుండఁ గృష్ణదేవరాయఁడు బాల్యమున నొక వేశ్యాంగనాపుత్రికతోడ నెయ్యమును గల్పించుకొనియెను. అంత దినక్రమమున నానెయ్యము గాడానురాగముక్రిందను బరిణమించి వర్ధిల్లుచుండెను. ఆమెపై దనకుఁగల మోహవిశ్వాసములనుబట్టి తనకు సామ్రాజ్యాధిపత్యము లభించినయెడల నామెను బట్టపురాణిగఁ జేతునని పలుమాఱు వాగ్దానము చేయుచు వచ్చెను. ఆవేశ్యాంగనా పుత్త్రిక నామము చిన్నమ్మ. ఈచిన్నమ్మకును దనకునుగల ప్రేమపాశమును ద్రేంచుకొనఁజాలక కృష్ణదేవరాయఁడు తానొక మహాసామ్రాజ్యమున కభిషిక్తుఁడయ్యును చిన్నమ్మయింటిబానిసీఁడై రాత్రులందు రహస్యముగా నామె గృహమునకు బోవు