పుట:Thimmarusumantri.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

తిమ్మరుసు మంత్రి


విశేషమునకు మెచ్చుకొని ప్రత్యుపకారముగాఁ బాదాభివందనం బాచరించెను, పిమ్మట తిమ్మరు సాతనిం దోడ్కొని వెలుపలికి వచ్చి గజారోహణముఁ జేయించి మఱియొకగజంబు పైఁ దానధిష్టించి శంఖకాహళభేరీప్రచండవాద్యరవంబులు భూనభోంతరమునిండ మహావైభవముతో నూరేగించి రాజమందిరమునఁ బ్రవేశపెట్టి యొక శుభముహూర్తమున రత్నసింహాసనాధిష్టితుం గావించెను.[1]


___________
  1. పై నుదహరించిన కథ కీర్తిశేషులైన బ్రహ్మశ్రీ గురుజాడ శ్రీరామమూర్తి పంతులవారి “తిమ్మరుసుమంత్రి చరిత్రము" నుండి గ్రహింపఁబడినది.