పుట:Thimmarusumantri.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

తిమ్మరుసు మంత్రి


కేవిధమైన యపకారమును గలుగకుండఁ బ్రతిదినమును వేయి గన్నులతో వీక్షింపుచు సంరక్షించుచున్న తిమ్మరుసు కారణములేనిదే నేఁడిట్టిపని చేసి యుండఁడనియు ఏది చేసినను తన యుపకారముకొఱకే చేయునన్న విశ్వాసము గలవాఁడు గావున తిమ్మరుసుం జూచి ప్రసన్నముఖుఁడై చిఱునవ్వు నవ్వుచు నత డిట్లనియె.

“అప్పా! కుమారునిఁ దండ్రి యూరక దండించునా ? ప్రేమలోపముచే దండించునని యెవ్వరైన నందురా ? కుమారుఁడు బాగుపడు మార్గము తండ్రికి దెలిసినట్లు తనయునకుం దెలియునా? దీనినే మహాప్రసాదముగా స్వీకరించు చున్నాఁడను.”

అని వినయవిధేయుఁడై భక్తిపురస్సరముగాఁ జేతులు జోడించుకొని నిలువంబడినఁ గృష్ణరాయనిఁ బునఃపునరాలింగనంబుఁ జేసికొని శిరంబు మూర్కొని యానంద బాష్పములు దొరుఁగ నతండు మరల నిట్లనియెను,

నాయనా! నీవిట్టివాఁడ వని యెఱింగి యున్నవాఁడ నగుట నేనీపాహసకార్యమున కొడిగట్టితిని. దీని నీవెట్లుగా భావింతువో యని భయపడుచున్నవాఁడను, నీవిపుడు నాపట్ల ప్రసన్నముఖుఁడవై పలుకుచున్నవాఁడవు గావున నాసంశయముసు భయమును నివారణములై నవి ఇఁక నేఁ జేసిన పనికి గారణమును దెలిపెద వినుము. నాయనా! నీవింతవఱకు