పుట:Thimmarusumantri.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

తిమ్మరుసు మంత్రి


మొక్కింత కుమారధూర్జటి యనుకవివరుండు తన కృష్ణరాయ విజయంబను గ్రంథమున నీక్రింది పద్యములలో నభివర్ణించి యున్నాడు.

"సీ. ప్రణుతింప నతఁడు తోరణ గట్టు పరిసీమ
               లనురీతి నూత్నతోరణము లెసఁగ
    రిపుల ఖండించి సత్కృపఁ దత్సుతుల నిల్పు
               నట్ల ద్వారములందు ననఁటు లలర
    విలిఖించునతఁడు దిక్కుల జయస్తంభాళి
               ననుమాడ్కిఁ జిత్తర్వుహర్వు లలర
    వెలయు నిట్లతనికీర్తులు దిక్తటుల నన్న
               సరణి ముతైఁపు ముగ్గుజగ్గు లమర

    నభినవాలంకృతిస్ఫూర్తి నతిశయించె
    నప్పురీరత్న మపుడు మహాద్భుతముగఁ
    బ్రకటమహిమల శ్రీకృష్ణరాయనృపతి
    శ్రీకరం బైనపట్టాభిషేకవేళ."

మహామండలేశ్వరులైన మహారాజు లనేకులు కృష్ణరాయనికిఁ గానుక లంపించిరి. అనేక సామంతనృపతులు పట్టాభిషేకము సందర్శింప విజయనగరమున కేతెంచిరి. మఱియు శ్రీరంగపట్టణముననుండి కుమార వీరశ్యామలరాయఁడు, కందనోలినుండి ఆర్వీటి శ్రీరంగరాజు, నంద్యాలనుండి నంద్యాల నారపరాజు, ఆకువీటినుండి ఆకువీటియిమ్మరాజు, గండికోటనుండి పెమ్మసాని రామలింగన్నభూపతి, కొచ్చెర్లకోటనుండి రావెల పెదతిమ్మభూపాలుఁడు, వెలుగోడునుండి వెలుగోటి