పుట:Thimmarusumantri.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

65


భావింపుచుఁ గృష్ణరాయఁడు నన్ను నమ్ముకొని యున్నవాఁడు. కులభేద మొక్కటి విడిచిన పక్షమున నేవిషయమునందును నా కుమారుఁ డైన గోవిందునికంటె భిన్నముగ నాతని జూచు కొనుచుండుటలేదు. సమస్తవిధములచేతను సామ్రాజ్యమును బరిపాలింపఁ దగినవాఁడు కృష్ణరాయఁడు గాని వీరనరసింహుని పుత్త్రుడైన తిరుమలరాయఁడు గాఁడు. కృష్ణరాయఁ డిరువదేండ్లు దాటినవాఁడు. తిరుమలరాయఁ డెనిమిదేండ్లవాఁడు. అశ్వపతులను గజపతులను నిగ్రహింపవలసిన ఘనకార్యములు ముందున్నవి. సామ్రాజ్యము నింకను బెంపు నొందింపవలసి యుండెను. కృష్ణరాయఁడే వీనినెల్ల నిర్వహింప సమర్ధుఁడు కాని యెనిమిదేండ్ల బాలునివలన నేమి కాఁగలదు ? వీనిమోసము చేసియైనఁ గృష్ణరాయనిఁగాపాడి యీసామ్రాజ్యమున కభిషిక్తుని గావింపవలయును. కృష్ణరాయని విడిచి నేను బ్రదుకఁజాలను. అని వెంటనే కృష్ణరాయనికి సమాచారమంపి రహస్యముగా రప్పించి యతనింగాంచి కన్నుల నీరు నించుచు నిట్లనియెను.

కృష్ణరాయా! వింటివా మీయన్నగారి వాక్యములు? తనకుమారునకుఁ బట్టము గట్టి నీకన్నులు పెఱికించి తెచ్చి చూపవలయునని నాజ్ఞాపించినాఁడు. ఇప్పుడు నేనేమిచేయ వలసియుండునో చక్కగా యోజించి చెప్పుము.

అని పిడుగువంటి యావార్త వినిపించెను. అప్పలుకు