పుట:Thimmarusumantri.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగనామాత్యుఁడు సామాన్యుఁడు గాఁడనియు, మహామంత్రిశేఖరుఁడనియు మాచయగారి మల్లనకవిప్రణీత మగురాజశేఖర చరిత్రములోని

"ఉ. సాళువనారసింహమనుజ ప్రభుకార్యకాళాధురంధరుం
      డై లవణాబ్దివేష్టిత ధరాదిపదుర్మత మంత్రమంత్రిశుం
      డాలవితానకేసరి యనంగననంగసమానరూపరే
      ఖాలలితాంగుఁ డట్టి చిటిగంగన యొప్పుగుణానుషంగుఁడై."

అనుపద్యమువలన వేద్యము గాఁగలదు.

నాయల్పజ్ఞత్వమువలన నిం దేవేని దోషములు దొరలినవానిని దెలిపినచో రెండవకూర్పున సవరించుకొందును. నేను పరస్థలమునం దుండుటచేత నిందచ్చుతప్పులు కుప్పలుగఁ బడినవి. వానిని మన్నించి శుద్దపత్రముంజూచి చదువుకొనవలయు నని చదువరుల వేఁడుకొనుచున్నాఁడను.

చిలుకూరి వీరభద్రరావు.

చెన్నపురి.

10 - 5 - 17.