పుట:Thimmarusumantri.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థ ప్రకరణము

59


మీకుఁ గప్పములను చెల్లించుట మానుకొనుటయె గాక మీ యధికారమును ధిక్కరించు చున్నారు. కొంత సైన్యముతో మీ తమ్ములను బనుప వార లా పాలెగాండ్రతో బోరాడియు వారిని సాధింపఁజాలక మరలి వచ్చిరి. వారలను జయించి కార్యము సాధించి కప్పములు గొనిరా నీవ సమర్థుండ వగుటంజేసి మీ యన్న నిన్నుఁబనుచుమని నా కాజ్ఞాపించెను. ఆతఁడు దక్షిణదేశవిజయయాత్రకుఁ బోయి యున్నవాఁడు. ఆతఁడు తిరిగి వచ్చినప్పటికి నీ వీ మహాకార్యమును నిర్వహించుకొని రావలయును. ఇందువలన నీకును జూలప్రతిష్ఠ కలుగును. నీయెడ నిఁకముం దెట్టి యనుమానమును మీయన్నకుండఁ బోదు. సత్వరముగ నచ్యుతరాయనిఁ దోడుగాఁగై కొని దక్షిణ కర్ణాటముపై దండయాత్ర వెడలు” మని నియమించి కొంత సైన్యము నాతనిపరము గావించెను>

కృష్ణరాయని విజయము.

ఇట్లు నియమింపఁబడిన కృష్ణరాయఁడును బహుళసైన్య సమేతుఁడై మంత్రిసత్తముని యాజ్ఞను శిరసావహించి వెంటనే కర్ణాటముపై దాడివెడలి యుమ్మత్తూరును ముట్టడించి మూడు మాసములు ఘోరయుద్ధముచేసి శత్రువులను దూలించి దుర్గమును స్వాధీనముఁ జేసికొనియెను. అపుడు శివసముద్రము కోటలో రాజ్యము చేయుచున్న త్యావరాజు స్వర్గస్థుఁడుకాగా నతనికుమారుఁడు గంగరాజు శివసముద్రముకోటలో నుండి