పుట:Thimmarusumantri.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

తిమ్మరుసు మంత్రి


వీరనరసింహుని పట్టాభిషేకము.

నరసరాయని మృతి తిమ్మరుసునకు మఱింత కష్టప్రదమయ్యెను. వీరనరసింహుఁడు తిమ్మరుసునకు విధేయుఁడుగాఁ గన్పట్టుచున్నను విశ్వాసపాత్రునిగా నెంచుకొనలేదు. తిమ్మరుసు కృష్ణరాయనికిఁ బట్టము గట్టునేమోయన్న యనుమానముసు భయమును నాతఁడు గలిగియుండెను. అందువలన నాతనికి మాత్సర్య మంకురించెను. తనకును కృష్ణరాయనికి నెట్టి యపకృతి గావించునో యన్నభయము తిమ్మరుసునకుఁ గలదు. తిమ్మరుసుమాత్రము నరసింహునిఁ దొలగించి కృష్ణరాయనికి బట్టము గట్టవలయునని యోజింపలేదు. ఇమ్మడి నరసింగరాయనికి బట్టము గట్టక వీరనరసింహునకుఁ బట్టము గట్టిన యెడల సేనానులకు, మంత్రులకుఁ బ్రజలకు నిష్టముగనుండునో లేదో యన్నభయముగలదు. సంగమరాజవంశీయుల పక్షమున నున్న వారివలనఁగూడ భయము గలదు. ఇమ్మడి నరసింగరాయని కంటె వీరనరసింహరాయఁడు బలస్తోమము మెండుగా నుండుటచేతను, ఇమ్మడి నరసింగరాయఁడు పెనుగొండలో నుండుట చేతను, వీరనరసింహరాయఁడు సింహాసన మాక్రమించుకొని తానే సార్వభౌముఁడనని ప్రకటించెను. అధికారి వర్గము తిమ్మరుసుమంత్రి పట్ల భయమును భక్తియును గలవారు గావున విద్యానగరమున నాతని నెదుర్కొనలేకపోయిరి. తిమ్మరుసునెడ దసకెంత యనుమాన మున్నను నతనితో వైరము, బెట్టు