పుట:Thimmarusumantri.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొఁదటికూర్పు పీఠిక.

ఈ గ్రంథమును బల్లారిలో జరిగిన పరిషత్సభలోఁ జదువుట కై ఆంధ్రసాహిత్యపరిషత్కార్యనిర్వాహకసభాధ్యక్షు లైన శ్రీయుత జయంతి రామయ్యపంతులవారిచేఁ బ్రేరేపితుఁడనై మొదట వ్యాసరూపమున సంగ్రహముగ వ్రాసితిని. కారణాంతరమువలన నేతత్సభకు నేను బోవుటకుఁగాని దీనిని చదివించుటకుఁ గాని సాధ్యపడలేదు. మహాపురుష జీవితములు మానవుల కాదర్శప్రాయములై వారి యుత్సాహశక్తులను వికసింపఁ జేయును. ధైర్యసాహసములను బురికొల్పును. సత్కార్యముల కున్ముఖులను జేయును. దుష్కార్యములకు విముఖులను గావించును, ప్రాపంచికానుభవమును వెల్లడించును. దేశభక్తిని ప్రోత్సహించును. పరమార్థమునుబోధించును. ఇట్టిమహాపురుషజీవితములు సారస్వతమునకు ముఖ్యాంగములని చెప్పనొప్పును. ఉద్బోధకములైన మహాపురుష జీవచరిత్రములతో నలంకరింపఁబడని సారస్వత మొకసారస్వత మనిపించుకొనదు. ఆంధ్రసారస్వతమున నిట్టి జీవచరిత్రములు బహుస్వల్పసంఖ్యకలవిగా నున్నవి. ఇట్టిలోపమును నివారించవలయు నను తలంపుతో నేనీ గ్రంథ రచనకు బూనుకొన సాహసించి పదునేనవ శతాబ్దిలో జనించిన మహాపురుషులలో నగ్రగణ్యుఁడును. మహారాజ్య తంత్రజ్ఞుఁడు నై ప్రపంచమున విఖ్యాతిఁగాంచిన తిమ్మరుసుమంత్రి చరిత్రమును మొదట ప్రారంభించినవాఁడను. జీవితచరిత్రము చిత్రించుటకుఁ గావలసిన పరికరణములు లేవు. అయినను తరతరములనుండి దేశమున జెప్పుకొనఁబడుచున్న కథలను, దేశీయులు వ్రాసిన చరిత్రములను, పూర్వకవి ప్రణీత ప్రబంధములను. శాసనములను బరిశోధించి యొకమాదిరి చరిత్రముము వ్రాసి ప్రకటింపఁ గలిగితిని. అప్పాజినిగూర్చిన కథలనేకములు గలవు. అందలి కథ లనేకములు విశ్వాసపాత్రములు కానందునను. గ్రంథవిస్తరభీతి