పుట:Thimmarusumantri.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ ప్రకరణము

35


వెడలనడచుటయొండెచేయుట నీకు శ్రేయోదాయకము. నీయొక్కయు, సామ్రాజ్యముయొక్కయు శ్రేయస్సును గోరి నిర్భయముగాఁ బలుకు చున్నాఁడను.”

ఇట్లు తిమ్మరుసుమంత్రి సాహసించి హితోపదేశము చేసిసప్పుడు మౌనము వహించి యూరకుండెను గాని బాలరాజు ప్రత్యుత్తర మీయఁ డయ్యెను. అంత తిమ్మరుసుమంత్రి బాలరాజునొద్ద సెలవుగైకొని సరసరాయనికడ కేతెంచి బాలరాజు మౌఢ్యము నెఱింగించి కలుగనున్న ప్రమాదమునుగూర్చి ముచ్చటించి యాదళవాయినిఁ బట్టుకొని సంహరించుట కర్తవ్యమని చెప్పి యందులకుఁ దగినమార్గమును సూచించెను. అతని హితోపదేశమును శిరసావహించి నరసరాయఁ డేదోమిష కల్పించుకొని తిమ్మరుసుతోఁగూడ పెనుగొండకుఁబోయి, అధికసైన్యమును గూర్చుకొని రహస్యముగా విద్యానగరమునకు వచ్చి ముట్టడించి భ్రాతృహంతకుఁ డైనదళవాయిని శిక్షింతువాలేక రాజ్యము విడిచెదవా యని బాలరాజునకు కబురు పంపెను. ఇట్లు దృఢనిశ్చయుఁడై తుళువ నరసరాయఁ డైదాఱు దినములు ముట్టడి వేసి విడువకయుండ బాలరాజు భయపడి యింకఁ గార్యము మించునని వెంటనే యాదళవాయిని జంపించి వాని తలను నరసరాయనికడకుఁ బంపెను. అప్పుడు నరసరాయుఁడు ముట్టడిని మాని యంతఃపురమునకు బోయి యా బాలరాజును సందర్శించి యింక నెన్నఁడు నిట్టికార్యములఁ జేయకుమని మందలించి యాతని నచ్చట నుంచక వేఱొక దుర్గమునకుఁ బంపి