పుట:Thimmarusumantri.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(5)

ద్వితీయ ప్రకరణము

23


షించినవాఁడై తనకడ నున్నమంత్రివరులను, దండనాధులను రప్పించి వారల కీసందేశమును విన్పింపఁగా వారెల్లరును సమ్మతించి తిమ్మరుసు బుద్ధినైశద్యమును మిక్కిలి గొనియాడిరి. అప్పుడా సాళ్వనరసింహభూపతి విద్యానగరముపై దండయాత్ర వెడలుట కాజ్ఞాపత్రమును వ్రాసి తనసై న్యాధ్యక్షునకుబంపెను.

{{}p|fs125|ac}తుళువనరసింహుని దండయాత్ర

సాళ్వనరసింహుని యాజ్ఞాపత్రమును తిమ్మరుసుమంత్రి సైన్యాధ్యక్షునకుఁ జదివి వినిపించెను. తాను తలపెట్టినకార్యమున కెల్లరును నామోదించుట భావిశుభసూచక మనిగ్రహించి తిమ్మరుసు పరమానందభరితుఁ డయ్యెను. అంతట తిమ్మరును నరసరాజును గాంచి “భూవరా! ఇఁక మనము జాగు సేయరాదు. సేనలను సన్నద్ధము గావించుకొని మనయుద్యమ మెవ్వరికిఁ దెలియకుండ నకస్మాత్తుగాఁ బోయి విద్యానగరముపై బడవలయును. అట్లు గానియెడల ప్రతిపక్షులవలనను శత్రువులవలనను మనకు ప్రతిబంధకము లేర్పడి మన ప్రయత్న మంతయు విఫలము గా వచ్చును. గాన మనకు నపకారము గలుగ వచ్చును. ఇట్టి సందర్భములయందాలస్యము జయప్రదముగాదు. ఈ మన ప్రయత్నములను మన ప్రతిపక్షనాయకు లగుదండనాధులు విన్న విద్యానగరమును సంరక్షించుట కై స్వసైన్యములతోఁ బ్రవేశింతురు. అప్పుడు గోటఁ జిదుపందగిన వాని గొడ్డలిచే నఱకవలసి వచ్చు" నని హెచ్చరించెను. నరస