పుట:Thimmarusumantri.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

తిమ్మరుసు మంత్రి


మాఱులు గాకుండునా? ఇట్టి సమయమున మన ముపేక్షించి యూరకుండుట మనదేశమునకును మతమునకు నపచారము సల్పినవార మగుదుము. పూర్వము జనకంటకుఁడై వేనుఁడు దుష్పరిపాలనము జేయుచుండఁ బ్రజలు వానినిఁ బదభ్రష్టుని గావించి పృథువునకుఁ బట్టము గట్టినట్లుగా నీకర్ణాటప్రభుని సింహాసనమునుండి దొలగించి మన సాళ్వనరసింహభూపాలుని సార్వభౌమునిగఁ జేసి పట్టాభిషిక్తుని గావింతము. నిలిచియున్న యీహైందవసామ్రాజ్యమును సముద్ధరింతము. మనరాజకీయ విద్యాగురువైన చిట్టిగంగనామాత్యుఁడు మనకు బోధించిన కరమధర్మ మిదియే సుమా.” అని ప్రబోధించెను. అంత నరసరాయఁ డీపలుకులను విని తిమ్మరుసు మోమొకింతసేపు తేఱిపాఱఁ జూచి యతని దూరఫుటాలోచనకు సంతసించి “మంత్రివరా! నీబుద్దికి మెచ్చితిని. అవును. నీవు చెప్పినది సత్వము. మన మీసమయమును బోనీయరాదు. మన మిప్పు డూరకుండిన తుదకు మనకే ముప్పు రాఁ గలదు. కర్ణాటప్రభువును సింహాసనమునుండి తొలగించి మనప్రభువర్యునకుఁ బట్టము గట్టుద” మని చెప్పి యప్పుడే యావిషయమును దెలుపుచు సాళ్వనరసింహభూపాలునకు సందేశముఁ బంపెను. అప్పటికే తిమ్మరుసు ప్రతిభాఢ్యుఁ డనియు, రాజ్యధురంధరుఁ డనియు సాళువనరసింహభూపాలుఁ డెఱింగి యుండెను. తిమ్మరుసువంటి ప్రతిభాఢ్యునిచేఁ బ్రబోధితుఁడై తన సైన్యాధ్యక్షుఁ డగు తుళువనరసారాయఁడు పంపించినసందేశమున కెంతయు సంతో