పుట:Thimmarusumantri.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

తిమ్మరుసు మంత్రి


పఱచుకొని పరిపాలించుచుండిరి. ఇంతకుఁ బూర్వమె చంద్రగిరి, పెనుగొండ, గండికోట రాజ్యముల నాక్రమించుకొని సాళ్వగుండ నరసింహభూపాలుఁడు మహాపరాక్రమవంతుఁడై అనుదినమును దనరాజ్యమును విస్తరింపఁజేయుచు స్వతంత్రుఁడై పరిపాలనము సేయుచు జనరంజకుఁడుగాఁ బ్రసిద్ది గాంచుచుండెను. ఇట్లు నానాటికిఁ గర్ణాటరాష్ట్రము బలము క్షీణించుచుండెను. దీని నంతయును జూచి సహింపఁజాలక వీని పెద్దకొడుకు తనతండ్రిని దనచేతులతోఁ జంపెను. వీనితమ్ముడు వీనిని జంపి, రాజయ్యెను. వీఁడును దనతండ్రివలెనె దుర్మార్గుడై దుష్పరిపాలనముఁ జేయ మొదలుపెట్టను. ఉద్దతులనడుమఁ బేదకుండ శక్యము గాని యట్లు తురుష్కులకును గజపతులకును నడుమఁబడి యిదివఱకే నలుగుచుండిన కర్ణాటసామ్రాజ్యము విద్యానగరమునందు సంభవించినట్టి రాజకీయవిప్లవస్థితినిఁ బురస్కరించుకొని బహమనీ సుల్తాను తానొక్కగ్రుక్కలో నీమహాసామ్రాజ్యమును మ్రింగి వేయవలయునని చూచుచుండెను గాని సాళ్వగుండయనారసింహునిభయముచేత వెనుకముందు నారయుచు సమయమునకై నిరీక్షించుచుండెను.

సమయాకర్షణము

తుళువనరసరాయనికడ మంత్రిపదవిని వహించిన తిమ్మరుసు ప్రతిభాఢ్యుఁడైనమంత్రి గావున విద్యానగర రాజకీయ విప్లవపరిస్థితులను దెలిసికొని యుపేక్షను వహింపక తానెవ్వని