పుట:Thimmarusumantri.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

తిమ్మరుసు మంత్రి


జయించి సాళ్వనరసింహరాయని రాజ్యమును విస్తరింపఁజేసెను. వీని విజయములనుగూర్చి వరాహపురాణమునం దిట్లభివర్ణింప బడియెనూ

"సీ. ఉదయాద్రి భేదించే హుత్తరి నిర్జించె
              గండికోటపురంబుఁ గదల ద్రవ్వెఁ
    పెనుగొండ సాధించే చెగ్గులూరు హరించె
              గోవెలనెల్లూరు గుంటుపిఱిచెఁ
    గుందాణి విడిలించే గొడుగుచింత జియించె
              దాగూరు పంచముపాడు చేనే
    నరుగొండ వెకిలించె నామూరు మర్దించె
              శ్రీరంగపురమును బాఱిసమరె

గీ. రాయచౌహత్తమల్ల ధరావరాహ
   మోహనమురారి బర్బరబాహుసాళ్వ
   నారసింహప్రతాపసన్న హనుఁ డగుచు
   విశ్వహితకారి తిమ్మయయీశ్వరుండు."

తిమ్మరుసుమంత్రి ప్రతిబాఢ్యు డని దేశమున విఖ్యాతిని గాంచుట తనమిత్రుఁ డైన నాదిండ్ల చిట్టిగంగనామాత్యుని వలన విని యూతనిచేఁ బ్రేరేపితుఁడై సాళ్వ గుండయ నారసింహ భూపాలుని యంగీకారమును బడసి తుళువనరసరాజు తిమ్మ