పుట:Thimmarusumantri.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

తిమ్మరుసు మంత్రి


గంగనామాత్యునిప్రాపును మొదట నభిలషింపలేదు. ఈబాలురు విద్యాభ్యసనము గావించి పేరుపొందినవారగుట విని నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడు వీరలను దనపట్టణమగు నారాయణ వనమునకు రప్పించెను. ఆకాలమునందు నారాయణవనము చంద్రగిరిరాజ్యమునకు రాజధానీ నగరముగ నుండెను. సాళ్వ నరసింహభూపాలుఁ డిచ్చటనే నివసింపుచుండెను. గావున నాతని ప్రధానమంత్రి యగు చిట్టిగంగనామాత్యుఁడు గూఁడ నారాయణవనమునందే నివసించు చుండెను. ఈగంగనామాత్యుఁడు సాళువ తిమ్మరాజును గోవిందరాజును రప్పించి వారివిద్యలను బరీక్షించి యాయవిద్యలయందు వారికిం గల ప్రజ్ఞావిశేషములం బరికించి మిక్కిలి సంతోషించి తనదివాణమునందు లేకరులనుగా నియమించెను. అట్లు వారు చిన్నపదవులందుండి తమ ప్రజ్ఞావిశేషములను జూపుచుఁ బైయధికారులదయను సంపాదించుకొని ప్రవర్తించుఁ చుండుటను గాంచి గంగనామాత్యుఁడు వారు రాజనీతిశాస్త్రము నభ్యసించినమహోన్నత పదవి నందఁగల రని నిశ్చయించి ప్రేమానురాగము లుట్టిపడ నొకనాఁడు తిమ్మనార్యుని రప్పించి 'తిమ్మనా! నీవు కడుబుద్ధి మంతుఁడవు ; ప్రతిభాశాలివి ; నీ పూర్వులు మంత్రిపదవులను బొంది ప్రఖ్యాతిఁ గాంచినవారు. వారికంటెను, మాకంటెను నీవు ప్రజ్ఞాఢ్యుడవై యుత్తమస్థానము నలంకరించి యీదక్షిణ హిందూస్థానమున కంతకును సర్వాధికారివై ధర్మపరిపాలనము గావింపఁగలవని నీశక్తినిబట్టి నేను గ్రహించితిని. నీవంటి సమర్థుడు నేఁడు మఱి - -