పుట:Thimmarusumantri.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమ ప్రకరణము

11


బఠించిరి. ఇట్లిరువరిరెండు సంవత్సరముల వయస్సు వచ్చునప్పటికి సంస్కృతాంధ్రముల యందు సంపూర్ణ పాండిత్యమును చాలవరకు శాస్త్రీయపరిజ్ఞానమును, గణక విద్యానైపుణ్యమును గడించి విశేషప్రతిభావంతులనియు, దయార్ద్రహృదయు లనియు, కార్వేటినగరము, నారాయణవనము, చంద్రగిరి, గుత్తి, పెనుగొండ మొదలగు పట్టణములఁ ప్రఖ్యాతి గాంచుచుండిరి. ఇఁక వీరలు రాజనీతిశాస్త్రమును దెలిసికొన వలసియుండిరి.

చిట్టిగంగనామాత్యుఁడు.

ఈబాలు రభ్యసింపపలసిన శాస్త్రములలోఁ బ్రధానమైనది యర్థశాస్త్రము. వానిని బోధింపఁ గల పండితులసంఖ్య బహుస్వల్పముగ నుండెను. అట్టిశాస్త్రమును బోధింపఁ గల మహనీయుఁ డొక్కఁడు చంద్రగిరిరాజ్యమునం దుండెను గాని యతఁడెల్లరకు సులభసాధ్యుఁడు గాఁడు. అతఁడు కౌశిక గోత్రుఁడైన నాదిండ్ల చిట్టిగంగనామాత్యుఁడు. ఈ మహానీయుఁడు తాను వృద్ధుఁడైనను చంద్రగిరిరాజ్యాధిపతి యైన సాళ్వనరసింహ మనుజాధీశ్వరుని ప్రధానమంత్రిగ నుండి యా రాజ్యమును విస్తరింపఁ జేయు చుండెను.

ఇఁత డిప్పటికి డెబ్బదేండ్లు నిండినవయస్సు గలవాఁ డైనను గాయపుష్టియును, బుద్ధివై శారద్యము నితనికి బలీయముగ నుండెను. ఈ మంత్రిశిఖామణి మనబాలురకు బంధువుఁ డైనను దైన్యదశయం దుండియు వీ రేమికారణము చేతనో చిట్టి